Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తన ఎంటైర్ కెరియర్ లో ఎంతోమందికి తను చేయూతను ఇచ్చాడు. టాలెంట్ ఉన్న యాక్టర్స్ ను ప్రోత్సహించాడు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో నిలబడతారు అని వాళ్లకు సపోర్టుగా నిలిచాడు. మరి అలాంటి చిరంజీవి మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి అందరిని తొక్కేస్తాడు అంటూ ప్రతి ఒక్కరు చాలా వరకు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఆయన నుంచి సహాయం పొందిన చాలామంది చిరంజీవి మాకు సహాయం చేశాడని స్వయంగా వాళ్లే కెమెరా ముందుకు వచ్చి చెబుతున్నారు. మరి ఇలాంటి క్రమంలో అవతలి హీరోకి స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేక సక్సెస్ లను సాధించలేక ఎదిగే ప్రసక్తి లేని సందర్భంలో వాళ్లని చిరంజీవి తొక్కేశాడు అంటూ చాలా రకాల కామెంట్స్ చేశారు.
బయట ఎవరు ఎన్ని కామెంట్స్ చేసిన కూడా చిరంజీవి కష్టం విలువ తెలిసిన మనిషి కాబట్టి ఎవరిని తొక్కేసే ప్రయత్నం చేయడు. అలాగే ఆయనకి ఆ అవసరం కూడా లేదు. ఎవరి ప్రతిభ వాళ్లది ఎవరి టాలెంట్ తో వాళ్లు ముందుకు సాగాల్సిందే తప్ప ఇక్కడ ఒకటిని తొక్కి మరొకరు పైకి వెళ్తారు అనేది ఏమీ లేదు.
టాలెంట్ ఉన్నవారిని జనాలు ప్రోత్సహిస్తారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే చిరంజీవి వీటిని పట్టించుకోకుండా తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఇప్పటికే చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. రేపు ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరకడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి…