Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie: 'వారణాసి' మ్యూజిక్ ఆల్బమ్ విడుదలపై సంచలన అప్డేట్.. మొత్తం ఎన్ని పాటలంటే..

Varanasi Movie: ‘వారణాసి’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలపై సంచలన అప్డేట్.. మొత్తం ఎన్ని పాటలంటే..

Varanasi Movie:  సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి ఒక ఇంటర్నేషనల్ మూవీ గా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేయబోతున్నాడు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఐమాక్స్ కెమెరా తో తెరకెక్కుతున్న చిత్రమిది. సుమారుగా 1400 కోట్ల రూపాయిల బడ్జెట్ తో టైం ట్రావెల్ , మైథాలజీ , అడ్వెంచర్ ని […]

Varanasi Movie:  సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి ఒక ఇంటర్నేషనల్ మూవీ గా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేయబోతున్నాడు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఐమాక్స్ కెమెరా తో తెరకెక్కుతున్న చిత్రమిది. సుమారుగా 1400 కోట్ల రూపాయిల బడ్జెట్ తో టైం ట్రావెల్ , మైథాలజీ , అడ్వెంచర్ ని జానర్స్ ని జోడించి , రాజమౌళి ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నాడు. ప్రపంచం లోనే ఇలాంటి తరహా మల్టీ జానర్ సినిమా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ‘వారణాసి’ చిత్రం నుండి ఒక్కటంటే ఒక్క బలమైన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. మహేష్ పుట్టినరోజు నాడు టీజర్ లేదా, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేస్తారని అంతా అనుకున్నారు.

కానీ కట్ చేస్తే కేవలం వర్కింగ్ స్టిల్స్ తో సరిపెట్టడం తో అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. అయితే ఈ చిత్రం నుండి సోషల్ మీడియా లో లీకైన ఒక అప్డేట్ ఇప్పుడు అభిమానుల్లో నూతనోత్సహాన్ని నింపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కీరవాణి ఈ మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ‘ ఈ చిత్రం లో ఆరు పాటలు ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘సంచారి’, ‘రణ కుంభ’ వంటి పాటలు విడుదలై చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే కీరవాణి ఆరు పాటలు ఉంటాయని అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు విడుదల చేసిన ఆ రెండు పాటలని కలుపుకొని 6 పాటలు ఉంటాయా?, లేదంటే 8 పాటలు ఉంటాయా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇకపోతే వచ్చే నెల మొదటి వారం లో ఈ చిత్రం నుండి మూడవ పాట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు 80 శాతం వరకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అట. అక్టోబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని, ఏప్రిల్ 7 న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేస్తారని అంటున్నారు. అదే విధంగా డిసెంబర్ నెల నుండే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడట రాజమౌళి. అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి , రాబోయే రోజుల్లో నాన్ స్టాప్ అప్డేట్స్ తో ఊపిరి ఆడనివ్వకుండా చేయబోతున్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper