Homeఆధ్యాత్మికంVaralakshmi Vratam Wishes: వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.. ఇలా ఆకట్టుకునేలా చెప్పండి..

Varalakshmi Vratam Wishes: వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.. ఇలా ఆకట్టుకునేలా చెప్పండి..

Varalakshmi Vratam Wishes: శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ పర్వదినం గురించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది దేశ విదేశాల్లో నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకోవాలని అనుకుంటారు. సాధారణంగా కాకుండా ప్రత్యేకంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా కొన్ని కొటేషన్స్ తో ఈ వ్రతానికి సంబంధించిన కొన్ని […]

Varalakshmi Vratam Wishes: శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ పర్వదినం గురించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది దేశ విదేశాల్లో నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకోవాలని అనుకుంటారు. సాధారణంగా కాకుండా ప్రత్యేకంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా కొన్ని కొటేషన్స్ తో ఈ వ్రతానికి సంబంధించిన కొన్ని పదాలను వాడుతూ శుభాకాంక్షలు తెలపడం వల్ల ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. మరి అలా ఆకట్టుకునే విధంగా ఉండే ఈ కొటేషన్స్ మీకోసం..

అమ్మవారి కృప మీ కుటుంబం పై ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటూ.. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మీ జీవితం కొనసాగాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.

మీ ఇంట్లో ఎప్పటికీ సిరిసంపదలు వెల్లివిరియాలి.. మీ జీవితం ఎప్పుడూ ఆనందమయంతో కొనసాగాలి.. మీ కుటుంబ సభ్యులందరికీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.

అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబ సభ్యులపై ఉండాలని.. మహాలక్ష్మి దీవెనలు మీకు కలగాలని మనసారా కోరుకుంటూ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు..

మీరు కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారిని కోరుకుంటూ.. ఎల్లప్పుడూ శాంతి, సంతోషాలు మీ కుటుంబంలో వెల్లివిరియాల అని అనుకుంటూ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు..

మంగళకరమైన పవిత్ర శుక్రవారం రోజున వచ్చే వరలక్ష్మి మీ జీవితంలో కొత్త కాంతులు ఉంచాలని.. మీ ఇంట్లో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ.. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు..

మీ ఇంట్లో నిత్యం సంతోషాలు వెల్లివిరియాలి.. మీ కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో జీవించాలి.. ఆ అమ్మవారి కృప మీపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు..

వరాలను అందించే వరలక్ష్మి మీ ఇంట్లో ఉండాలని.. ఆ అమ్మవారి కృప మీద మీ కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు..

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని సేవించి.. ఆ మహాతల్లి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ.. ప్రతిరోజు మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాల అని ఆశిస్తూ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు..

ఎలాంటి బాధలు లేకుండా.. అష్టైశ్వర్యాలు.. అనుకున్న పని పూర్తి కావడానికి అవసరమైన స్థలాన్ని చేకూర్చే అమ్మవారి దయ మీ కుటుంబం పై ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు

విష్ణుమూర్తి పత్ని అయినా అమ్మవారి దయ మీపై ఉంచి మీ విజయానికి తోడ్పాటున అందించాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు..

సకల కార్యసిద్ధిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారి దయ మీపై ఉండాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper