Varalakshmi Vratham Donations: శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మహిళలు ప్రత్యేకంగా ఈరోజున ఈ పర్వదినాన్ని వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఈ పండుగ సందర్భంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వరలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా కొలిచి పూజలు చేయడంతో పాటు మహిళలు అంతా కలిసి వాయునం ఇచ్చుకుంటూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అలాగే ఈ పవిత్రమైన రోజున దానధర్మాలు చేయడం వల్ల కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ఇలాంటి వస్తువులు దానం ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..
మహాలక్ష్మి అమ్మవారికి గాజులు అంటే ఎంతో ఇష్టం. గాజులు వేసుకున్న ఆడవారు అంటే మహా ఇష్టం. అయితే కొందరు ఆర్థిక సమస్యలతో ఆడవారు గాజులు వేసుకోకుండా ఉంటారు. ఇలాంటి వారికి లేదా ఇతరులకు గాజుల దానం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ గాజులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని చెబుతున్నారు.
శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి తీపి వస్తువులు అంటే మహా ఇష్టం. ఈ రోజున తీపి వస్తువులతో నైవేద్యం చేయడం వల్ల వారికి అడిగిన వరాలు ఇస్తారని చెబుతారు. అయితే ఇదే సమయంలో చక్కెర వంటి తీపి వస్తువులు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే ఈరోజు పెరుగు దానం ఇవ్వడం వల్ల కూడా కుటుంబం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు. బంధువులతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
మహాలక్ష్మి దేవి శుక్రగ్రహానికి అధిపతిగా ఉంటారు. అందువల్ల ఈ పవిత్రమైన రోజున బాలికలకు లేదా పేదలకు తెల్ల రంగు కలిగిన మిఠాయిలను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. వీటిని దానం ఇవ్వడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని పేర్కొంటున్నారు.
ఆడవారు అలంకరణతో ఉండడంవల్ల అమ్మవారు సంతోషిస్తారు. అయితే వరలక్ష్మి వ్రతం రోజున ఇతరులకు పట్టుచీరలు లేదా ఇతర చీరలు దానం ఇవ్వడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.