Homeఆంధ్రప్రదేశ్‌Teacher Student Incident : హోంవర్క్ చేయలేదని దండించిన ఉపాధ్యాయురాలు.. ఇంతలోనే గుండె పగిలిన విద్యార్థి.....

Teacher Student Incident : హోంవర్క్ చేయలేదని దండించిన ఉపాధ్యాయురాలు.. ఇంతలోనే గుండె పగిలిన విద్యార్థి.. వీడియో వైరల్*

Teacher Student Incident : విశాఖ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ప్రణయ్ తేజ అనే విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందడం పై రకరకాలుగా ప్రచారం నడుస్తోంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. వీడియో సైతం హల్ చల్ చేస్తోంది. పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని చెంప మీద కొట్టడం.. తరువాత ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. అయితే సదరు ఉపాధ్యాయురాలు కొట్టడం […]

Teacher Student Incident : విశాఖ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ప్రణయ్ తేజ అనే విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందడం పై రకరకాలుగా ప్రచారం నడుస్తోంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. వీడియో సైతం హల్ చల్ చేస్తోంది. పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని చెంప మీద కొట్టడం.. తరువాత ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. అయితే సదరు ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే ఆ చిన్నారి చనిపోయిందంటూ బంధువులు కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాలో సైతం ఈ దృశ్యం వైరల్ అవుతోంది. అయితే ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే ఆ విద్యార్థి చనిపోయాడని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆరోపిస్తుండగా.. ఆ స్థాయిలో ఉపాధ్యాయురాలు హింసించిన దాఖలాలు లేవు. కేవలం భయంతోనే ఆ విద్యార్థి గుండె పగిలినట్లు అక్కడ ఉన్న దృశ్యాలు తెలియజేస్తున్నాయి.

* ప్రైవేట్ స్కూల్లో ఘటన..
విశాఖ వన్ టౌన్ పరిధిలో లిటిల్ గార్డెన్ అనే ప్రైవేటు పాఠశాల నడుస్తోంది. ఈ క్రమంలో ప్రణయ్ తేజ అనే ఆరేళ్ల విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురవుతూ మృతి చెందారు. అయితే ఆ విద్యార్థి మృతికి పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు కారణమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. తరగతి గదిలో ఓ విద్యార్థి హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరుస క్యూలో నిల్చున్న విద్యార్థులకు సంబంధించి హోం వర్క్ ను పరిశీలించారు సదరు ఉపాధ్యాయురాలు. అయితే అందులో ప్రణయ్ తేజ అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి హోం వర్క్ చేయకపోవడంతో సదరు ఉపాధ్యాయురాలు మందలించింది. ఎందుకు హోంవర్క్ చేయలేదని ప్రశ్నించింది. విద్యార్థి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చెంప మీద కొట్టింది. అయితే అక్కడికి క్షణాల వ్యవధిలోనే ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు. ఇంతలోనే అప్రమత్తమమైన స్కూల్ యాజమాన్యం వెంటనే కేజీహెచ్ ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందాడు. అయితే ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే ఆ విద్యార్థి చనిపోయాడు అంటూ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

* కేవలం ప్రశ్నించినందుకే..
అయితే సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్న ఆ వీడియోలో.. సదరు ఉపాధ్యాయురాలు విపరీతంగా హింసిస్తున్నట్లు ఎటువంటి దృశ్యాలు కనిపించలేదు. కేవలం ఎందుకు హోంవర్క్ చేయలేదు అని ప్రశ్నించినట్టు కనిపించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలు చేయి చేసుకున్నారు. కొద్దిసేపటికి ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోయారు అది కూడా ఆ ఉపాధ్యాయురాలి చేతిలోనే. తీవ్ర ఆందోళనకు గురైన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే కేజీహెచ్ కు తరలించారు. అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందారు. కేవలం భయాందోళనకు గురై గుండె పగలడం వల్లే ఆ విద్యార్థి చనిపోయారు అనేది బహిరంగ రహస్యం. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ కావడంతో ఆ విద్యార్థి చనిపోవడానికి ఉపాధ్యాయురాలే కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper