Today 21 august 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అమ్మవారి అనుగ్రహం ఉండే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు కూడా ఆలోచించాలి. దూరప్రాయణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో కలిసి వస్తుంది. వీరి జీవితం అన్యోన్యంగా కొనసాగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతోంది. శుభకార్యాలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు వివాదాలకు తలదూర్చకుండా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు కోర్టు కేసుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. మహిళలు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అమ్మవారిని ఈరోజు ఆరాధించడం వల్ల ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ విషయాలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. ఆస్తుల కొరుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల ఆశీస్సులతో పెట్టుబడులు పెడతారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కలిసివస్తుంది. వీరికి పై అధికారుల నుంచి సపోర్టు ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని ఆర్థిక ప్రగతి ఉంటుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని చేసే పెట్టుబడును అధిక లాభాలను ఇస్తాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పెండింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దీంతో వీరికి అన్నీ కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొన్ని పెట్టుబడులను సాధించడానికి అవసరమైన ఆర్థిక వనరులు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఇదే మంచి సమయం.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆటంకాలు తొలగిపోతాయి. దాన ధర్మాలు చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించిన ధన లాభం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఈ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అనవసరపు ఖర్చులు చేస్తారు. అయితే కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే వారికి ఇదే మంచి సమయం. కష్టకాలంలో మిత్రుల సహాయం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు వృత్తిపరమైన విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. ఉద్యోగులకు అదరపు ఆదాయం చేకూరుతుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక లాభం ఎక్కువగా ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈరోజు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. దీంతో కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. తీర్థయాత్రలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. నీతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.