Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోని ఒకే కథతో ఇద్దరు హీరోలు సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి, జగపతిబాబు ఇద్దరు కూడా ఒక కథతో సినిమాలను చేసి సక్సెస్ ని సాధించారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇంతకీ వాళ్ళిద్దరు ఒకే కథతో చేసిన సినిమాలు ఏంటి? ఆ మూవీస్ సక్సెస్ అయ్యాయా లేదా అనేది ఒకసారి మనం తెలుసుకుందాం… మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘చూడాలని ఉంది’ అనే సినిమా వచ్చింది. జగపతిబాబు కీలక పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘అంతఃపురం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ రెండు సినిమాల కథలు కూడా ఒకటే… చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి భార్య చనిపోతుంది. తన కొడుకుని వెతుక్కుంటూ వస్తాడు. తను ఎలాగైనా సరే తనతో పాటు కొడుకును కూడా తీసుకెళ్లాలని ఆయన కోసం తిరుగుతుంటాడు.
అంతఃపురం సినిమా స్టోరీ విషయానికి వస్తే సౌందర్య తన భర్త ఆయన సాయికుమార్ చనిపోవడంతో తన బిడ్డను ఎలాగైనా సరే తనతో పాటు లండన్ కి తీసుకెళ్లాలని రాయలసీమ ప్రాంతానికి వస్తుంది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్రలో నటించాడు.
ఇక ఈ రెండు సినిమాల్లో కూడా విలన్ ప్రకాష్ రాజే కావడం విశేషం… రెండు సినిమాల కథలు ఇంచుమించు ఒకేలా ఉన్నప్పటికి ప్రజెంటేషన్ మాత్రం డిఫరెంట్ వే లో ఉంటుంది. అందువల్లే రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.
చూడాలని ఉంది సినిమాతో గుణశేఖర్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అంతఃపురం మూవీ తో కృష్ణవంశీ సైతం టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచిపోయాడు. అంతఃపురం సినిమాలో విలన్ గా నటించినందుకు ప్రకాష్ రాజు కి నేషనల్ అవార్డు వచ్చింది…ఇక గుణశేఖర్, కృష్ణవంశీ ఇద్దరు కూడా రామ్ గోపాల్ వర్మ శిష్యులే కావడం విశేషం…