Homeఎంటర్టైన్మెంట్Eshwar Sai: నేను మాధురి రూమ్‌కు అందుకే వెళ్లాను : అసలు నిజం చెప్పి ఫోక్...

Eshwar Sai: నేను మాధురి రూమ్‌కు అందుకే వెళ్లాను : అసలు నిజం చెప్పి ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయి

Eshwar Sai: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ఈశ్వర్ రాయి, మాధురి రాథోడ్ వ్యవహారం ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండగా , ఈశ్వర్ సాయి సతీమణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం , ఆ తర్వాత మాధురి ని బూతులు తిడుతూ, ఆమె రెండు చెంపలు చెళ్ళుమనించడం వంటివి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక […]

Eshwar Sai: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ఈశ్వర్ రాయి, మాధురి రాథోడ్ వ్యవహారం ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండగా , ఈశ్వర్ సాయి సతీమణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం , ఆ తర్వాత మాధురి ని బూతులు తిడుతూ, ఆమె రెండు చెంపలు చెళ్ళుమనించడం వంటివి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఈశ్వర్ సాయి ఒక ఇంటర్వ్యూ లో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. కానీ మాధురి మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. కానీ నా పరువుకు భంగం కలిగించారు అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే ఈశ్వర్ సాయి మరో సంచలనాత్మక వీడియో ని అప్లోడ్ చేసాడు.

ఆయన మాట్లాడుతూ ‘అసలు మీరంతా ఏమనుకుంటున్నారండీ, ఎందుకు ఇలా ట్రోల్స్ చేస్తున్నారు. మీడియా అయితే రకరకాలుగా ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తోంది. నేను ఇప్పటికే మీ అందరికీ చెప్పాను. మేమిద్దరం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము అని. ఆరోజు జరిగింది మీకు తెలిసింది కేవలం 10 శాతం మాత్రమే , 90 శాతం ఏమి జరిగిందో మీకు తెలియదు. ఆరోజు నాకు షూటింగ్ ఉన్నింది. ఉదయం 5 గంటల 30 నిమిషాలకే నేను షూటింగ్ లొకేషన్ కి వెళ్ళిపోవాలి. నేను 4 గంటల 30 నిమిషాలకు నిద్ర లేచి వాష్ రూమ్ కి వెళ్లాలని అనుకుంటే, నా అసిస్టెంట్ అందులో ఉన్నాడు. అప్పుడు నేను మాధురి రూమ్ కి వాష్ రూమ్ కోసం వెళ్లాను. ఆమె బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నింది, ఆ సమయం లో ఎవరో నా భార్యని కావాలని తప్పుబటిస్తూ ఈ సమాచారాన్ని తెలియజేసారు’.

‘ఆమె అక్కడికి వచ్చి పెద్ద గొడవ చేసింది. ఆ సమయం లో ఈ విషయం పెద్దది చేయకూడదని మేము కూడా సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు ఈశ్వర్ సాయి. అయితే ఆయన మాట్లాడిన ఈ మాటలను అత్యధిక శాతం మంది నమ్మడం లేదు. వాష్ రూమ్ లోకి కేవలం అండర్ వేర్ తోనే ఈశ్వర్ సాయి వెళ్ళాడు. అంటే పక్క రూమ్ నుండి ఆయన అండర్ వేర్ తోనే వచ్చాడా?, ఎవరైనా అలా వెళ్తారా?, అడ్డంగా దొరికిపోయి , ఈ రేంజ్ లో ట్రోల్ అయ్యాక , ఇప్పుడు మేము సుద్దపూసలం అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by eshwar sai (@eshwar_sai026)

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper