Homeఎంటర్టైన్మెంట్Mahakali Glimpse: ప్రశాంత్ వర్మ మహాకాళి.. మాటల్లేవ్.. గూస్ బంప్స్ కానీ.. అదొక్కటే మిస్..

Mahakali Glimpse: ప్రశాంత్ వర్మ మహాకాళి.. మాటల్లేవ్.. గూస్ బంప్స్ కానీ.. అదొక్కటే మిస్..

Mahakali Glimpse: అ, జాంబిరెడ్డి, హనుమాన్ వంటి సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ కావడం.. ఆ సినిమాకు సంబంధించి సీక్వెల్స్ తీయాలని అతడు ముందుగానే నిర్ణయించుకోవడంతో.. ఆ పరంపరలో అనేక చిత్రాలను అతడు ప్రకటించాడు. అయితే అవి ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరిస్థితి. ఇన్నాళ్లపాటు సాగిన సందిగ్ధాన్ని మొత్తానికి తెరదించాడు ప్రశాంత్ వర్మ. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన […]

Mahakali Glimpse: అ, జాంబిరెడ్డి, హనుమాన్ వంటి సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ కావడం.. ఆ సినిమాకు సంబంధించి సీక్వెల్స్ తీయాలని అతడు ముందుగానే నిర్ణయించుకోవడంతో.. ఆ పరంపరలో అనేక చిత్రాలను అతడు ప్రకటించాడు. అయితే అవి ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరిస్థితి.

ఇన్నాళ్లపాటు సాగిన సందిగ్ధాన్ని మొత్తానికి తెరదించాడు ప్రశాంత్ వర్మ. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన హనుమాన్ సినిమా తర్వాత మహాకాళి అనే చిత్రాన్ని రూపొందించాడు ప్రశాంత్. ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. మహాకాళి సినిమా ఆర్కేడి స్టూడియోస్ బ్యానర్ మీద.. ఆర్కే దుగ్గల్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. పూజ అపర్ణ కొల్లూరు డైరెక్షన్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సినిమాను అన్ని ప్రముఖ భాషలలో విడుదల చేస్తున్నారు. భూమిశెట్టి.. రాకేష్ బేడీ.. సముద్ర ఖని.. మురళి శర్మ.. శియా రెడ్డి వంటి వారు ముఖ్య పాత్రులు పోషిస్తున్నారు.. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమా విడుదల కాపోతోంది.

ఈ సినిమాలో అక్షయ్ కన్నా శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తున్నారు. శ్రియ రెడ్డి అమ్మవారి పాత్రలో నటిస్తోంది. భూమిశెట్టి దైవంశ సంభూతురాలిగా కనిపిస్తోంది. హనుమాన్ సినిమాలో సముద్రఖని విభీషణుడి పాత్రలో నటించారు. అయితే ఆ పాత్రను ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ప్రారంభంలో అక్షయ కన్నా శుక్రాచార్యుడి పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. విష్ణుమూర్తి అమృతం తీసుకున్నాడని.. కేవలం దేవతలకు ఇచ్చాడని.. రాక్షసులను తొక్కేశాడని.. భూమ్మీద మానవజాతి లేకుండా చేస్తానని.. రాక్షసులకు వైభవం వచ్చేలాగా కృషి చేస్తానని శుక్రాచార్యుడు అన్న మాటలు ఈ గ్లిమ్స్ లో కనిపించాయి.. పురాణ నేపథ్యంలో ఉన్న సినిమా కాబట్టి ఎఫెక్ట్స్ విపరీతంగా ఉపయోగించారు. ఈ గ్లిమ్స్ చివరిలో శ్రియా రెడ్డి అమ్మవారి పాత్రలో ఎంట్రీ ఇచ్చింది. భూమిశెట్టిని చేతిలోకి తీసుకొని.. తన విశ్వరూపం చూపించింది.

ప్రశాంత్ వర్మ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే మహాకాళి సినిమాలో అందరూ తమిళ.. కన్నడ.. పరిశ్రమకు చెందిన నటులు మాత్రమే ఉన్నారు. ఇందులో తెలుగు వారు ఒక్కరు కూడా లేకపోవడం పెద్ద లోటు. తెలుగు నటుల పాత్రలను కూడా పరిచయం చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతటి భారీ స్థాయి సినిమా తీస్తున్నప్పుడు.. తెలుగు నటులను కూడా పరిచయం చేస్తే మార్కెట్ విస్తృతి పెరిగేది. తద్వారా సినిమా స్కేల్ ఒక స్థాయికి చేరుకునేది. మరి ఈ లోటును ప్రశాంత్ వర్మ ఎలా భర్తీ చేస్తాడో చూడాల్సి ఉంది.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper