Bethlehem Kudumba Unit: కొన్ని సినిమాలు థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటాయి , కానీ ఓటీటీ లో మాత్రం మిశ్రమ స్పందన దక్కించుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ గా నిల్చి , ఓటీటీ లో మాత్రం సూపర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. నిర్మాతలకు ఇదొక విచిత్రమైన అనుభవం అనే చెప్పాలి. అలా రీసెంట్ గా కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘బేతేలమ్ కుడుంబా యూనిట్’ మూవీ ఒక ఉదాహరణ గా నిల్చింది. మలయాళం హీరో నివిన్ పౌలీ, మమిత బైజు హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. ఈ చిత్రానికి ముందు నవీన్ పౌలీ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ఉండేవి. ఇక ఆయన కోలుకోవడం కష్టమే అని అందరూ అనుకుంటున్న సమయంలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 320 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. తెలుగు లో కూడా ఈ సినిమాని డబ్ చేసి థియేటర్స్ లో విడుదల చేశారు. ఇక్కడ కూడా డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ షేర్స్ రావడం దాదాపుగా ఆగిపోవడం తో ఈ చిత్రాన్ని రీసెంట్ గానే జియో హాట్ స్టార్ లో విడుదల చేశారు. మలయాళం తో పాటు , తెలుగు , తమిళం , హిందీ , కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. అయితే హాట్ స్టార్ లో ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ నెగెటివ్ టాక్ చెప్తున్నారు. సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉందని, 300 కోట్ల గ్రాస్ ని రాబట్టేంతలా ఈ సినిమాలో అసలు ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి సినిమాలు మన తెలుగు హీరోలు చేస్తే , ఆడియన్స్ ఫ్లాప్ చేస్తారని , కానీ మలయాళం లో మాత్రం ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ‘అంటే సుందరానికి ‘, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలు చాలా బాగుంటాయని , వాటిని మన ఆడియన్స్ కాపాడుకోలేకపోయారని, ఇవే సినిమాలు మలయాళం లో రిలీజ్ అయ్యుంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యేవని అంటున్నారు. అలోచించి చూస్తే నెటిజెన్స్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందని అనిపిస్తోంది. ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ సినిమాలు చూడకుండానే నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఆ కారణం చేతనే చాలా మంచి సినిమాలు నాశనం అయ్యాయి. మలయాళం లో ఇలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి.