Homeఎంటర్టైన్మెంట్నితిన్ తో అంటే పూజా హెగ్డే ఒప్పుకుంటుందా ?

నితిన్ తో అంటే పూజా హెగ్డే ఒప్పుకుంటుందా ?

హీరో నితిన్ సినిమాల స్పీడ్ రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పటికే, ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. అలాగే మూడో సినిమా ‘మ్యాస్ట్రో’ త్వరలోనే ఓటీటీ వేదిక పై రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఈ మూడు సినిమాలకు తోడు ఈ ఏడాది ఇంకో రెండు సినిమాలకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఆ రెండు సినిమాలను కూడా లాంచ్ చేయనున్నాడు. కాగా నితిన్ త్వరలో ప్రారంభించే ఆ రెండు సినిమాలకు హీరోయిన్లని ఫిక్స్ […]

Nithin With Pooja Hegde

హీరో నితిన్ సినిమాల స్పీడ్ రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పటికే, ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. అలాగే మూడో సినిమా ‘మ్యాస్ట్రో’ త్వరలోనే ఓటీటీ వేదిక పై రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఈ మూడు సినిమాలకు తోడు ఈ ఏడాది ఇంకో రెండు సినిమాలకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఆ రెండు సినిమాలను కూడా లాంచ్ చేయనున్నాడు.

కాగా నితిన్ త్వరలో ప్రారంభించే ఆ రెండు సినిమాలకు హీరోయిన్లని ఫిక్స్ చేసే కార్యక్రమం మొదలైందని.. టాప్ హీరోయిన్లను తన సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవాలని నితిన్ తెగ ఉబలాట పడుతున్నాడట. నిజానికి గత కొన్ని సినిమాలుగా నితిన్ ఓన్లీ పాపులర్ హీరోయిన్లతోనే జతకడుతున్నాడు. ‘బీష్మ’లో రష్మిక మందాన’, ‘చెక్’లో రకుల్ ప్రీత్ సింగ్, ‘రంగ్ దే’లో కీర్తి సురేష్ ఇలా నితిన్ సరసన అందరూ స్టార్ హీరోయిన్లే నటించారు.

అన్నట్టు నితిన్ – దర్శకుడు వక్కంతం వంశీ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రానుంది. అయితే వంశీ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో నితిన్ కి జోడీగా పూజా హెగ్డేని తీసుకురావాలని వంశీ ప్లాన్ చేస్తున్నాడు. కారణం ఆమె అయితేనే ఈ సినిమాకి న్యాయం జరిగుతోందని నితిన్ ఫీల్ అవుతున్నాడట.

పూజ హెగ్డేతో కలిసి పని చేయాలని నితిన్ ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నా కుదరలేదు. అయితే నిర్మాత ఠాగూర్ మధు ఈ సారి నితిన్ కోరిక తీర్చడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మరి వరుస బాలీవుడ్ సినిమాలతో తెగ హడావిడి చేస్తోన్న పూజ నితిన్ సినిమా ఒప్పుకుంటుందా ? ఆమె ఒప్పుకుంటే సినిమాకి క్రేజ్ వస్తుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper