Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ సత్తా ఏంటో నేటి తరం ఆడియన్స్ కి తెలిసేలా చేసిన చిత్రం ‘జైలర్’. ఈ సినిమాకు ముందు రజినీకాంత్ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకున్నాడు. ఇక ఆయన పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో, కాసుల కనకవర్షం కురిసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 650 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘జైలర్ 2’ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ , ఒక చిన్న ప్రోమో ని విడుదల చేశారు.
ఈ ప్రోమో లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో వేలకొద్దీ రీల్స్ ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద వచ్చాయి. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే , ఇక సినిమాలోని మొదటి పాట విడుదలయ్యాక ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అని అంతా అనుకున్నారు. అలాంటి అంచనాల నడుమ కాసేపటి క్రితమే మొదటి పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ‘అలబోలెలో’ అంటూ సాగే ఈ పాటలోని బీట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. పూర్తి పాట ఈ నెల 21 న విడుదల చేయబోతున్నారు. ప్రోమో ని చూస్తుంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నుండి మరో బాంబ్ లాంచ్ అయ్యింది అనిపిస్తోంది.
ఇక మరిన్ని విశేషాల్లోకి వెళ్తే , ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి నటిస్తుండగా , హృతిక్ రోషన్ ప్రత్యేక అతిథి పాత్రలో నటించాడు. ఆయన పాత్ర ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లబోతుందని టాక్. ముందుగా ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ , షారుఖ్ ఖాన్ , నందమూరి బాలకృష్ణ వంటి సూపర్ స్టార్స్ ని అడిగారు. కానీ కొన్ని కారణాల వల్ల , వాళ్ళు ఈ పాత్రలో నటించలేదు. వాళ్లకు బదులుగా హృతిక్ రోషన్ ఈ పాత్రని ఏ రేంజ్ లో చేసాడో తెలియాలంటే అక్టోబర్ 15 వరకు ఆగాల్సిందే.