Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha 2: ఎలిమినేషన్ కి దగ్గర్లో ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్.. 'అగ్ని...

Bigg Boss Agnipariksha 2: ఎలిమినేషన్ కి దగ్గర్లో ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్.. ‘అగ్ని పరీక్ష 2’ లో ఊహించని ట్విస్ట్..

Bigg Boss Agnipariksha 2: ఎవ్వరూ ఊహించని సంఘటనలు మొత్తం ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లోనే జరుగుతూ ఉంటాయి. కచ్చితంగా పలనా కంటెస్టెంట్ టైటిల్ గెలుస్తాడని అనుకుంటాము, కానీ వాళ్ళు మధ్యలోనే ఎలిమినేట్ అవుతుంటారు. కానీ ఎలిమినేషన్ కి దగ్గరగా వచ్చిన కంటెస్టెంట్స్ కొంతమంది టైటిల్ విన్నర్ గా నిల్చిన సందర్భాలు కూడా మనల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఉదాహరణకు గత రెండు బిగ్ బాస్ సీజన్స్ ని తీసుకోవచ్చు. ‘బిగ్ బాస్’ మాత్రమే కాదు […]

Bigg Boss Agnipariksha 2: ఎవ్వరూ ఊహించని సంఘటనలు మొత్తం ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లోనే జరుగుతూ ఉంటాయి. కచ్చితంగా పలనా కంటెస్టెంట్ టైటిల్ గెలుస్తాడని అనుకుంటాము, కానీ వాళ్ళు మధ్యలోనే ఎలిమినేట్ అవుతుంటారు. కానీ ఎలిమినేషన్ కి దగ్గరగా వచ్చిన కంటెస్టెంట్స్ కొంతమంది టైటిల్ విన్నర్ గా నిల్చిన సందర్భాలు కూడా మనల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఉదాహరణకు గత రెండు బిగ్ బాస్ సీజన్స్ ని తీసుకోవచ్చు. ‘బిగ్ బాస్’ మాత్రమే కాదు , ‘అగ్ని పరీక్ష’ షో కూడా ఇలాగే తయారైంది. సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ప్రక్రియ లో భాగంగా గత సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సీజన్ కూడా మంచి ఊపు మీద ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ సీజన్ ఆడిషన్స్ లో ఆడియన్స్ దృష్టిని విశేషం ఆకర్షించిన కంటెస్టెంట్స్ ముగ్గురు ఉన్నారు.

వారు మితిలేష్ , రాజకుమారి దయానా, ఆర్జే చరణ్. వీరిలో రాజకుమారి దయానా టాస్కుల్లో అద్భుతంగా పర్ఫార్మ్ చేసి రెండు సార్లు ఓటు అప్పీల్ కూడా చేసింది. కానీ మితిలేష్ , ఆర్జే చరణ్ లు మాత్రం చాలా వెనుకబడ్డారు అట. వీరిలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఒక్క స్టార్ కూడా రాలేదట. ఆశించిన స్థాయిలో వీళ్లిద్దరు టాస్కులు ఆడకపోవడం తో జడ్జీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆడిషన్స్ లో వీళ్లిద్దరు జడ్జీలను మాత్రమే కాదు , ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకర్షించారు. ముఖ్యంగా ఆర్జే చరణ్ ని చూసి ఆల్ రౌండర్, ఇతను కచ్చితంగా బిగ్ బాస్ కి పనికొస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈయన సరిగా పెర్ఫార్మన్స్ ఇవ్వలేదట. మంచి టాస్కులు ఆడే స్కోప్ కూడా పాపం ఇతనికి రాలేదట.

ఇక మితిలేష్ ఫిజిక్ ని చూడగానే , ఇతను కచ్చితంగా టాస్కులు అల్లాడించేస్తాడు, ఇతన్ని తోటి కంటెస్టెంట్స్ తట్టుకోవడం చాలా కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఇతనికి కూడా ఇప్పటి వరకు ఒక్క స్టార్ కూడా రాలేదట. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఆడిషన్స్ సమయం లో దాదాపుగా ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లొచ్చిన రోహిత్ నాయుడు , అద్భుతంగా టాస్కులు ఆడుతున్నాడట . ఇతనికి ఇప్పటి వరకు రెండు స్టార్స్ వచ్చినట్టు సమాచారం. ఓటు అప్పీల్ కూడా రెండు సార్లు చేసాడట. దీన్ని బట్టీ పెద్దలు చెప్పే ఒక మాట గుర్తుకు వస్తోంది. ‘డోంట్ జడ్జ్ బుక్ బై కవర్ పేజ్’ అనే మాట గుర్తుకు వస్తోంది. గత సీజన్ లో కూడా ప్రసన్న కుమార్ అనే కంటెస్టెంట్ కి మూడు గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి , నేరుగా టాప్ 15 కి వెళ్ళాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు మితిలేష్ , ఆర్జే చరణ్ లకు కూడా అలాంటి గతి పడుతుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper