Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha 2: నిబంధనలను ఉల్లగించిన 'అగ్ని పరీక్ష 2' జడ్జీలు.. అసలు ఆ...

Bigg Boss Agnipariksha 2: నిబంధనలను ఉల్లగించిన ‘అగ్ని పరీక్ష 2’ జడ్జీలు.. అసలు ఆ కంటెస్టెంట్ కి ఎంట్రీ ఎలా దొరికింది?

Bigg Boss Agnipariksha 2: ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో ఈమధ్య కాలం లో నిబంధనలకు విరుద్ధంగా , వాళ్లకు ఇష్టమొచ్చినట్టు , టీఆర్ఫీ రేటింగ్స్ కోసం విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఒక టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం జపాన్ దేశానికీ చెందిన ‘ఫుటా తెలుగు’ అనే అబ్బాయిని ‘అగ్ని పరీక్ష 2’ లో పాల్గొనేలా చేయడమే. ‘బిగ్ బాస్’ రూల్స్ ప్రకారం , కేవలం ఇండియన్స్ కి మాత్రమే […]

Bigg Boss Agnipariksha 2: ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో ఈమధ్య కాలం లో నిబంధనలకు విరుద్ధంగా , వాళ్లకు ఇష్టమొచ్చినట్టు , టీఆర్ఫీ రేటింగ్స్ కోసం విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఒక టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం జపాన్ దేశానికీ చెందిన ‘ఫుటా తెలుగు’ అనే అబ్బాయిని ‘అగ్ని పరీక్ష 2’ లో పాల్గొనేలా చేయడమే. ‘బిగ్ బాస్’ రూల్స్ ప్రకారం , కేవలం ఇండియన్స్ కి మాత్రమే ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలకు సంబంధించిన వాళ్లకు ఎంట్రీ లేదు. ఈ నిబంధన ని తుంగలోకి తొక్కుతూ ‘ఫుటా తెలుగు’ లో ‘అగ్ని పరీక్ష 2’ కి ఎంపిక చేయడం , టాలెంటెడ్ కంటెస్టెంట్స్ అయిన మన తెలుగు వాళ్ళను 8 మందిని కారణం లేకుండా ఒకేసారి ఎలిమినేట్ చేయడం న్యాయమా అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

‘ఫుటా తెలుగు’ అనే వ్యక్తి జడ్జీలను మైమరపించేలా చేశాడా అంటే అది కూడా లేదు. వచ్చాడు , నాలుగు తెలుగు పదాలతో జడ్జీలను , యాంకర్ శ్రీముఖి ని పలకరించాడు , ఆ తర్వాత డ్రమ్ములు వాయించాడు, వెళ్ళాడు. ఇతనికి బిందు మాధవి , నవదీప్ లు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు కానీ , అభిజిత్ మాత్రం గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఆయన ఎందుకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడో , ఆయనకే తెలియాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అర్హులైన వాళ్లకు వీళ్ళు ఒక్క గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వడానికి చాలా బెట్టు చూపించారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఉదాహరణకు ‘అపర్ణ లేడీ టైగర్’ అనే అమ్మాయి డిఫెన్స్ సంస్థ ని ఒక స్థాపించి , ఎంతో మందికి రన్నింగ్ లో ట్రైనింగ్ ఇస్తోంది. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ అని జడ్జీలను బ్రతిమిలాడుకుంది.

ఆమె అడిగిన విధానం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక తప్పదు, అలాంటి ఆమెకి గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వలేదు. అదే విధంగా అభిజ్ఞ అనే అమ్మాయి నిన్న జడ్జీలను విశేషంగా ఆకట్టుకుంది, ఈమెకు రెండు గ్రీన్ ఫ్లాగ్స్ కూడా ఇచ్చారు. కానీ చివర్లో 8 మందిని ఎలిమినేట్ చేశారు కదా, అందులో ఈమె కూడా ఉంది. ‘ఫుటా తెలుగు’ లో నచ్చింది ఏంటి?, ‘అభిజ్ఞ’ అనే అమ్మాయి లో నచ్చనిది ఏంటి?, అసలు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇలా చాలామంది అర్హులైన కంటెస్టెంట్స్ ని పంపేసి , నిబంధనలను సైతం ఉల్లఘించి ‘ఫుటా తెలుగు’ ని తదుపరి రౌండ్స్ కి క్వాలిఫై చేయడం ఏంటో?, దీనికి కూడా బిగ్ బాస్ టీం సమాధానం చెప్పాల్సిందే అంటూ నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper