Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీInstagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా...

Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ

Instagram Views: ఒకప్పుడు ఫేస్బుక్ సోషల్ మీడియాలో దుమ్ము రేపేది. ఆ తర్వాత యూట్యూబ్ వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ కాదు ఇన్ స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్ ఇన్ స్టాగ్రామ్ లో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. వీడియోలు.. రీల్స్ తో హవా కొనసాగిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత పాపులారిటీ. వ్యూస్.. ఫాలోవర్స్ ఆధారంగా డబ్బులు వస్తాయి. సెలబ్రిటీ […]

Instagram Views: ఒకప్పుడు ఫేస్బుక్ సోషల్ మీడియాలో దుమ్ము రేపేది. ఆ తర్వాత యూట్యూబ్ వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ కాదు ఇన్ స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్ ఇన్ స్టాగ్రామ్ లో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. వీడియోలు.. రీల్స్ తో హవా కొనసాగిస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత పాపులారిటీ. వ్యూస్.. ఫాలోవర్స్ ఆధారంగా డబ్బులు వస్తాయి. సెలబ్రిటీ హోదా వస్తుంది. ఇంకా అనేక రకాల సౌలభ్యాలు లభిస్తాయి. అందువల్లే చాలామంది ఇన్ స్టాగ్రామ్ లో పాపులారిటీ సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. వీడియోలు పెడుతుంటారు. దానికి తగ్గట్టుగా రీల్స్ చేస్తుంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే క్లిక్ అవుతూ ఉంటారు. మిగతావారు ఎంత చేసినా సరే పెద్దగా పాపులారిటీ దక్కదు.

ఇన్ స్టా గ్రామ్ లో పాపులర్ కావాలి అంటే..

ముందుగా మనం చేస్తున్న వీడియో ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి. అప్పుడే ఆ వీడియో చివరి వరకు చూస్తారు. మీ వీడియోకు ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ లేదా సౌండ్స్ జోడిస్తే ఇక తిరుగు ఉండదు. మీరు రూపొందించిన కంటెంట్ నలుగురికి షేర్ చేసే విధంగా లేదా ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడే మీ వీడియోలు పాపులర్ అవుతూ ఉంటాయి. రోజు లేదా వారానికి సరైన సమయంలో క్రమం తప్పకుండా పోస్ట్ చేయడం ద్వారా ఇన్ స్టాగ్రామ్ మీ ప్రొఫైల్ ఆల్గారిధం గుర్తిస్తుంది.. మీకు రీచ్ కావాలి అంటే.. దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు.. ఆకర్షణీయమైన క్యాప్షన్స్ రూపొందించాలి.

మానవ సంబంధిత వీడియోలకు ఎక్కువగా పాపులారిటీ ఉంటుంది. వాటిని చాలామంది చూస్తారు. ఉదాహరణకు ఒక వివాహ వేడుక జరుగుతుంటే.. దానిని మొత్తం బంధించాల్సిన అవసరం లేదు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు.. ఇద్దరి మధ్య తెర తొలగుతున్నప్పుడు.. ఒకరి కాళ్లు మరొకరు తొక్కుతున్నప్పుడు.. భార్య మెడలో భర్త తాళి కడుతున్నప్పుడు.. ఉంగరం కోసం ఇద్దరు పోటీపడుతున్నప్పుడు.. అరుంధతి నక్షత్రాన్ని భార్యకు భర్త చూపిస్తున్నప్పుడు.. ఇటువంటి సందర్భాలను ఒక వీడియో లాగా రూపొందించి పోస్ట్ చేస్తే విపరీతమైన వీక్షణలు వస్తుంటాయి. ఈ మనిషి అయినా సరే మానవ సంబంధాలకే విలువ ఇస్తుంటాడు. మనుషుల మధ్య జరిగే వ్యవహారాలకే ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. అది సోషల్ మీడియా అయినా సరే.. ప్రధాన మీడియా అయినా సరే.. ఈ విషయాలను గుర్తుంచుకుంటే తిరుగు ఉండదు. ఇంకేముంది ఈ చిట్కాలు చదివారు కదా.. మీరు వీటిని ఫాలో అయితే.. అమలు చేయగలిగితే.. మీరే ఇన్ స్టా గ్రామ్ లో నెంబర్ వన్ అవుతారు.. ఇంకేముంది ట్రై చేయండి.. ఆల్ ది బెస్ట్.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper