
‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తీసిన తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ కు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. అతడితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం సై అంటున్నారు. ఇక ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు ఇదే వేణు శ్రీరామ్ తో మరో మూవీ చేయడానికి రెడీ అయిపోయారు.
ఇటీవలే నిర్మాత దిల్ రాజుతో తాను సంతోషంగా లేనని.. ఆయన క్యాంప్ నుంచి బయటకు వెళ్తున్నాడని మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారా శ్రీరామ్ వేణు అనుకున్నది సాధించాడట.. దిల్ రాజ్ పిలిచి సినిమా చేద్దామని సర్ది చెప్పినట్టు తెలిసింది.
‘వకీల్ సాబ్’ మూవీ గ్రాండ్ హిట్ తో తాను టాప్ డైరెక్టర్ అయ్యానని వేణు శ్రీరామ్ భావిస్తున్నాడు. కానీ పరిశ్రమ ఆయన విషయంలో భిన్నంగా ఆలోచిస్తోంది. కానీ ఆ వినయం విధేయత మాత్రం వేణు శ్రీరామ్ లో లేవని.. తనకు సక్సెస్ బ్రేక్ ఇచ్చిన సంస్థతో కలిసి పనిచేయడానికి వేణు శ్రీరామ్ సిద్ధంగా లేడని అంటున్నారు.
అయినా కూడా నిర్మాత దిల్ రాజు తాజాగా వేణు శ్రీరామ్ కు స్వేచ్ఛ నిచ్చినట్టు తెలిసింది. అతడు సినిమాకు ఏఏ హీరోలు, క్యారెక్టర్లను ఎంచుకోవాలని నీ ఇష్టం అని చెప్పాడట.. అల్లు అర్జున్ తో తీయబోయే ‘ఐకాన్’ సినిమా కోసం టీంను, నటీనటులను ఎంపిక చేసుకునేందుకు దిల్ రాజ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
‘ఐకాన్’ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. స్క్రిప్ట్ చాలా కాలం క్రితమే సిద్ధమైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘వకీల్ సాబ్’తో హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ ఒక్క సినిమా విజయంతోనే ఇంతలా బెట్టు చేస్తున్నాడంటే.. ఫ్లాపులొస్తే ఈయన భవిష్యత్ ఏంటన్నది అందరికీ అర్థం కాకుండా ఉంది.