Homeక్రీడలుSania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి.. కాబోయే వరుడి నేపథ్యం ఏంటంటే..

Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి.. కాబోయే వరుడి నేపథ్యం ఏంటంటే..

Sania Mirza: టీమిండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి నేపథ్యం లేకుండానే ఆమె టెన్నిస్ లో సంచలన తారగా ఎదిగింది. తన గ్లామర్ తో టెన్నిస్ ప్రపంచాన్ని ఊపేసింది. సింగిల్స్.. డబుల్స్..మిక్స్ డ్ డబుల్ విభాగంలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే సానియా మీర్జా వివాహం చేసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో వివాహం చేసుకుంది. సానియా మీర్జాకు.. షోయబ్ […]

Sania Mirza: టీమిండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి నేపథ్యం లేకుండానే ఆమె టెన్నిస్ లో సంచలన తారగా ఎదిగింది. తన గ్లామర్ తో టెన్నిస్ ప్రపంచాన్ని ఊపేసింది. సింగిల్స్.. డబుల్స్..మిక్స్ డ్ డబుల్ విభాగంలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే సానియా మీర్జా వివాహం చేసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో వివాహం చేసుకుంది. సానియా మీర్జాకు.. షోయబ్ మాలిక్ కు ఒక కుమారుడు సంతానం. 2010లో పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా కాలం పాటు అన్యోన్యంగా ఉన్నారు. వీరిద్దరూ దుబాయ్ ప్రాంతంలో నివసించారు. అక్కడ ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేశారు. అప్పుడే వారిద్దరూ కలిసి వ్యాపారాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ 2024 లో వారిద్దరు విడిపోయారు.

సానియాతో విడిపిన తర్వాత షోయబ్ మాలిక్ పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక సినీనటిని పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు ఆమెతోపాటు సంసారాన్ని సాగించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. వివాహానికంటే ముందే షోయబ్ మాలిక్ కు వివాహం జరిగిందని సమాచారం. షోయబ్ మాలిక్ తో విడాకుల తర్వాత సానియా మీర్జా తన కొడుకుతో సింగిల్ మామ్ గానే జీవితాన్ని కొనసాగిస్తోంది. తన టెన్నిస్ అకాడమీ.. ఇతర వ్యాపారాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ కంటే ఎక్కువగా దుబాయ్ ప్రాంతంలోనే ఆమె నివసిస్తోంది. అప్పట్లో ఆమెకు క్రికెటర్ మహమ్మద్ షమీకి సంబంధం ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే అదంతా వాస్తవం కాదని తర్వాత తేలింది.

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సానియా మీర్జా రెండో పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఆమె ఒక ఫారినర్ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అతడు విదేశానికి చెందిన వ్యక్తి అని.. అతడు వ్యాపారం చేస్తుంటాడని.. కొంతకాలంగా వారిద్దరు ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాలని వారిద్దరు నిర్ణయించుకున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు కూడా ఆమె ప్రేమకు ఆమోదం తెలిపారని… త్వరలోనే వారిద్దరు వైవాహిక బంధం లోకి అడుగుపెడతారని సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper