Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha 2: ఆ క్యాటగిరీ జనాలకు 'బిగ్ బాస్ 10' లోకి 'నో...

Bigg Boss Agnipariksha 2: ఆ క్యాటగిరీ జనాలకు ‘బిగ్ బాస్ 10’ లోకి ‘నో ఎంట్రీ’..? ఇదెక్కడి అన్యాయం!

Bigg Boss Agnipariksha 2: ‘బిగ్ బాస్’ రియాలిటీ షో అంటే ఒక మినీ సొసైటీ లెక్క. విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు , వంద రోజుల పాటు సాధారణ ప్రపంచానికి దూరం గా ఎలా ఉండగలరు?, ఈ క్రమం లో వాళ్ళ నుండి వచ్చే ఎమోషన్స్ ఆధారంగా ఈ షో నడుస్తోంది. తెలుగు ఆడియన్స్ లో ఈ రియాలిటీ షో కి అపూర్వమైన స్పందన లభిస్తోంది. 9 సీజన్స్ పూర్తి అయ్యాయి, 10 వ సీజన్ […]

Bigg Boss Agnipariksha 2: ‘బిగ్ బాస్’ రియాలిటీ షో అంటే ఒక మినీ సొసైటీ లెక్క. విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు , వంద రోజుల పాటు సాధారణ ప్రపంచానికి దూరం గా ఎలా ఉండగలరు?, ఈ క్రమం లో వాళ్ళ నుండి వచ్చే ఎమోషన్స్ ఆధారంగా ఈ షో నడుస్తోంది. తెలుగు ఆడియన్స్ లో ఈ రియాలిటీ షో కి అపూర్వమైన స్పందన లభిస్తోంది. 9 సీజన్స్ పూర్తి అయ్యాయి, 10 వ సీజన్ వచ్చే నెల 6 నుండి ప్రారంభం కాబోతుంది. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. అందుకు సంబంధించిన ఆడిషన్స్ ఎపిసోడ్స్ ని గత నాలుగు రోజుల నుండి మనమంతా చూస్తూనే ఉన్నాం. రేపటి నుండి ఈ షో లో ‘డేర్ ఆర్ డై’ అంకం మొదలు కానుంది.

ఇదంతా పక్కన పెడితే ‘బిగ్ బాస్’ షో కి అందరూ సమానమే , అన్ని క్యాటగిరీలకు చెందిన వాళ్ళు ఈ షోలో పాల్గొనచ్చు అని అందరూ అంటున్నారు. ఇది వరకు అలాగే సాగింది కూడా. అయితే ఈ సీజన్ లో ‘ట్రాన్స్ జెండర్స్’ కి చోటు ఇవ్వకూడదు అని బిగ్ బాస్ టీం బలమైన నిర్ణయం తీసుకుందా?, లేదా ‘అగ్ని పరీక్ష 2’ లో ఉన్న జడ్జీలకు ‘ట్రాన్స్ జెండర్స్’ అంటే చిన్న చూపు ఉందా ? అనేది అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ లో ‘ఉప్పల్ బాలు’ ని రిజెక్ట్ చేసినప్పటి నుండి ఈ షో పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ‘ఉప్పల్ బాలు’ ని చాలా మంది ‘ట్రాన్స్ జెండర్’ అని అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఆ క్యాటగిరీ కాదు అని ఉప్పల్ బాలు మొన్న ఆడిషన్స్ లో చెప్పుకొచ్చాడు.

కానీ జడ్జీలకు అతను ‘ట్రాన్స్ జెండర్’ అనే బలమైన నమ్మకం ఉంది. ‘నీలాంటోళ్లని బిగ్ బాస్ హౌస్ కి పంపించి సమాజానికి మేము ఏమి మెసేజ్ ఇవ్వాలి’ అని నవదీప్ ఉప్పల్ బాలు ని అడగడం పెద్ద దుమారమే రేపింది. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటి?, ‘ట్రాన్స్ జెండర్స్’ ని బిగ్ బాస్ హౌస్ కి పంపకూడదు అనేనా? అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. కనీసం అతనిలో ఏమి టాలెంట్ ఉందో చూడకుండా , బయటకు నెట్టేయడం దేనిని సూచిస్తుంది?, దీనికి బిగ్ బాస్ టీం సమాధానం చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఉప్పల్ బాలు సంగతి పక్కన పెడితే , గౌరీ త్రినేత్ర అనే మరో ట్రాన్స్ జెండర్ కూడా ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నది. ఆమెకు కూచిపూడి నాట్యం లో గిన్నిస్ రికార్డు కూడా ఉంది. అలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయిని ముందుకు వెళ్ళడానికి మరో అవకాశం ఎందుకు ఇవ్వలేదు?, కేవలం ‘ట్రాన్స్ జెండర్’ అనే కారణంతోనే ఆమెని రిజెక్ట్ చేశారా?. మాలో కలిగిన ఈ అనుమానాలకు బిగ్ బాస్ టీం కచ్చిగా సమాధానం చెప్పాల్సిందే అంటూ నెటిజెన్స్ నిలదీస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper