Homeఎంటర్టైన్మెంట్Toxic Movie: 'టాక్సిక్' మూవీ టీం కి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్.. మండిపడుతున్న నెటిజెన్స్..

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ టీం కి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్.. మండిపడుతున్న నెటిజెన్స్..

Toxic Movie: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ కి టికెట్ రేట్స్ విషయం లో మహర్దశ పట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదు , ప్రతీ సినిమాకు కోరిన వెంటనే టికెట్ రేట్స్ ఇచ్చేస్తున్నారు. పైగా సినిమాటోగ్రఫీ శాఖ జనసేన ఖాతాలో ఉండడం , పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో కందుల దుర్గేష్ కి పూర్తి స్వేచ్చ ఇవ్వడం తో ఎలాంటి ఆంక్షలు లేకుండా […]

Toxic Movie: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ కి టికెట్ రేట్స్ విషయం లో మహర్దశ పట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదు , ప్రతీ సినిమాకు కోరిన వెంటనే టికెట్ రేట్స్ ఇచ్చేస్తున్నారు. పైగా సినిమాటోగ్రఫీ శాఖ జనసేన ఖాతాలో ఉండడం , పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో కందుల దుర్గేష్ కి పూర్తి స్వేచ్చ ఇవ్వడం తో ఎలాంటి ఆంక్షలు లేకుండా టికెట్ హైక్స్ ఇస్తున్నారు. మన టాలీవుడ్ సినిమాల వరకు పర్వాలేదు, డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్స్ ఇస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘కాంతారా 2’ కి టికెట్ హైక్స్ ఇచ్చారు , అదే విధంగా ఎన్టీఆర్ ‘వార్ 2’ కి కూడా టికెట్ హైక్స్ ఇచ్చారు, ఇది ఎంత వరకు సమంజసం అనేదే ఇప్పుడు ప్రశ్న.

ఇక ఈ నెల 26 న కన్నడ హీరో యాష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు టికెట్ హైక్స్ ఇవ్వడానికి మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కర్ణాటక లో మన సినిమాలను ఎదో ఒక కారణంగా అక్కడ అడ్డుకుంటున్న రోజులివి. థియేటర్స్ వద్ద తెలుగు లో బ్యానర్స్ రాసినందుకు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా అడ్డుకున్న ప్రాంతమది. అలాంటి ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమాకు టికెట్ రేట్స్ ఇవ్వడం ఏంటి అనేది నెటిజెన్స్ నుండి వినిపిస్తున్న వాదన. మంచితనం ఉండొచ్చు కానీ , అతి మంచి తనం ఉండకూడదు, అది ఎప్పటికీ చెడు నే చేస్తుంది, మన చేతకాని తనం లాగా వాళ్ళు తీసుకునే ప్రమాదం కూడా ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ‘టాక్సిక్’ మూవీ విషయానికి వస్తే , ఈ సినిమా ఎప్పుడో మార్చి 19 న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఆగస్టు 26 న విడుదల కానుంది. ఇంతకు ముందుతో పోలిస్తే ఈసారి ఈ సినిమాకు మంచి హైప్ ఉందనే చెప్పాలి. కర్ణాటక తో పాటు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ గ్యారంటీ అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ , ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper