Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan- Namrata Shirodkar: షాకింగ్.. పవన్ కళ్యాణ్ - నమ్రత శిరోడ్కర్ కాంబినేషన్ లో...

Pawan Kalyan- Namrata Shirodkar: షాకింగ్.. పవన్ కళ్యాణ్ – నమ్రత శిరోడ్కర్ కాంబినేషన్ లో మిస్సైన సినిమా అదేనా..!

పెళ్లయ్యాక సినిమాలు మానేస్తేనే పెళ్లి చేసుకుంటానని మహేష్ కండిషన్ పెట్టాడట అప్పట్లో,అందుకే నమ్రత సినిమాలను ఆపేసింది. కానీ మహేష్ బిజినెస్ వ్యవహారాలు మొత్తం చూసుకునేది నమ్రత శిరోడ్కర్ మాత్రమే. ఆమె ఏది చెప్తే అదే జరుగుతుందట ఇంట్లో. అయితే నమ్రత శిరోద్కర్ కి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Pawan Kalyan- Namrata Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోడ్కర్ పెద్ద బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తో టాలీవుడ్ లో ‘వంశీ’ అనే చిత్రం చేసే సమయానికే ఆమె మహేష్ కంటే పెద్ద స్టార్. తెలుగు లో మహేష్ బాబు తో తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘అంజి’ చిత్రంలో మాత్రమే నటించింది. ఆ తర్వాత మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లాడాక సినిమాలకు గుడ్ బై చెప్పి సంసార జీవితాన్ని చూసుకుంటూ వచ్చింది.

పెళ్లయ్యాక సినిమాలు మానేస్తేనే పెళ్లి చేసుకుంటానని మహేష్ కండిషన్ పెట్టాడట అప్పట్లో,అందుకే నమ్రత సినిమాలను ఆపేసింది. కానీ మహేష్ బిజినెస్ వ్యవహారాలు మొత్తం చూసుకునేది నమ్రత శిరోడ్కర్ మాత్రమే. ఆమె ఏది చెప్తే అదే జరుగుతుందట ఇంట్లో. అయితే నమ్రత శిరోద్కర్ కి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అదేమిటంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘బాలు’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, అభిమానుల మనసులో ప్రత్యేకమైన స్థానం కలిగించుకున్న సినిమా. ఈ చిత్రం లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ పాత్ర గురించి అప్పట్లో చాలా మాట్లాడుకునేవాళ్ళు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా నమ్రత శిరోడ్కర్ ని సంప్రదించారట మేకర్స్. ఆమెకి కథ బాగా నచ్చింది కానీ, నటించేందుకు మహేష్ బాబు అనుమతి కోసం ఎదురు చూసిందట.

ఎలాగో ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం, ఇప్పుడు సినిమాలు ఎందుకు, చిరంజీవి గారి సినిమా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకొని రా చాలు, కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వకు అని అన్నాడట మహేష్ బాబు. దీనితో అయిష్టంగానే ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందట నమ్రతా శిరోడ్కర్. ఈ విషయం తెలుసుకొని అభిమానులు షాక్ కి గురయ్యారు. ఒకవేళ ఈ సినిమా ఒప్పుకొని చేసి ఉంటే కెరీర్ లో గుర్తుండిపోయే రేంజ్ రోల్ పడి ఉండేదని అభిమానులు అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper