Homeఎంటర్టైన్మెంట్Ajay Bhupathi Mangalavaram: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వచ్చి మంగళవారం మూవీ రీమేక్ రైట్స్ అడిగితే...

Ajay Bhupathi Mangalavaram: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వచ్చి మంగళవారం మూవీ రీమేక్ రైట్స్ అడిగితే అజయ్ భూపతి ఏం చెప్పాడో తెలుసా..

Ajay Bhupathi Mangalavaram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన దర్శకుడు అజయ్ భూపతి…తన స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రొటీన్ కథలను కాకుండా డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మంగళవారం సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత అతనికి చాలా మంచి క్రేజ్ పెరిగింది. దాంతో పాటుగా బాలీవుడ్ లో ఉన్న కొంతమంది మేకర్స్ సైతం […]

Ajay Bhupathi Mangalavaram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన దర్శకుడు అజయ్ భూపతి…తన స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రొటీన్ కథలను కాకుండా డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మంగళవారం సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత అతనికి చాలా మంచి క్రేజ్ పెరిగింది. దాంతో పాటుగా బాలీవుడ్ లో ఉన్న కొంతమంది మేకర్స్ సైతం వచ్చి మంగళవారం సినిమా రీమేక్ రైట్స్ అడిగారట. మీరు మంగళవారం సినిమా నేను తీసినట్టుగా తీయలేరు కాబట్టి దాని సోలు చెడిపోతుంది అందుకే నేను ఎవరికి రీమేక్ రైట్స్ ఇవ్వను అంటూ అజయ్ భూపతి ఓపెన్ గా మొహం మీద చెప్పేసారట.

దాంతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సైతం కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అజయ్ భూపతి స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. అతనికి ఏది అనిపిస్తే అది చెప్పేస్తుంటాడు. ఎదురుగా ఎవరన్నా సరే మొహం మీదే చెప్పడం అతనికి అలవాటు. కాబట్టి తన సినిమాని తను తప్ప ఎవరూ అలా తీయలేరు అనే ఒక కాన్ఫిడెంట్ తో అతను ఉన్నాడు.

అందుకే అతనికి డబ్బులు వస్తున్నా కూడా వాటిని వద్దనుకొని ఆ సినిమా రైట్స్ ని వాళ్ళకి ఇవ్వలేదట. మరి తొందరలోనే మంగళవారం 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. రీసెంట్ గా ఘట్టమనేని ఫ్యామిలీ మూడోతరం వారసుడు అయిన జయకృష్ణ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమా చేశాడు.

ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా జయకృష్ణ నటన బాగుంది అంటూ డైరెక్టర్ అజయ్ భూపతి కుర్రాడి చేత చాలా బాగా నటింపజేశాడు అంటూ ఆయనకి మంచి పేరైతే వచ్చింది. తొందర్లోనే మంగళవారం 2 సినిమా స్టార్ట్ చేసి వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper