Homeలైఫ్ స్టైల్Quick Marriages: పెళ్లికి తొందరపడుతున్నారు.. ఆరు నెలలు ఆగలేరట..!

Quick Marriages: పెళ్లికి తొందరపడుతున్నారు.. ఆరు నెలలు ఆగలేరట..!

Quick Marriages: ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ముందుగా… నిశ్చితార్థం నిర్వహించేవారు. ఆ తరువాత కనీసం ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకొని ఇతర పనులు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పెళ్లి కుదిరిన వెంటనే మ్యారేజ్ కు రెడీ అవుతున్నారు. దీనినే ‘క్విక్ మ్యారేజ్’ అంటున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతోంది. పెళ్లి కుదిరిన వెంటనే పెళ్లి చేయాలని అంటున్నారు. ఇలా పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నారు? అసలేంటీ క్విక్ మ్యారేజ్? కొత్త జీవితం కోసం ఆరాటం.. […]

Quick Marriages: ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ముందుగా… నిశ్చితార్థం నిర్వహించేవారు. ఆ తరువాత కనీసం ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకొని ఇతర పనులు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పెళ్లి కుదిరిన వెంటనే మ్యారేజ్ కు రెడీ అవుతున్నారు. దీనినే ‘క్విక్ మ్యారేజ్’ అంటున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతోంది. పెళ్లి కుదిరిన వెంటనే పెళ్లి చేయాలని అంటున్నారు. ఇలా పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నారు? అసలేంటీ క్విక్ మ్యారేజ్?

కొత్త జీవితం కోసం ఆరాటం..
ప్రస్తుతం చాలా మంది ఉన్నత విద్య పూర్తి చేసి, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే వివాహం గురించి ఆలోచిస్తున్నారు. దీంతో పెళ్లి వయస్సు కూడా గతంతో పోలిస్తే పెరిగింది. ఉద్యోగ బాధ్యతలు, విదేశీ అవకాశాలు, తరచూ బదిలీలు వంటి అంశాల కారణంగా సంబంధం కుదిరిన తర్వాత ఎక్కువకాలం వేచి ఉండడం ఇష్టపడడం లేదు. మంచి సంబంధం దొరికిన వెంటనే వివాహం పూర్తి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

క్విక్ మ్యారేజ్ ఎందుకు?
ఈ నేపథ్యంలో ధోరణిని దృష్టిలో ఉంచుకుని కొన్ని మ్యాట్రిమోని బ్యూరోలు ప్రత్యేకంగా ‘క్విక్ మ్యారేజెస్’ సేవలను అందిస్తున్నాయి. త్వరగా సంబంధం చూపించడం.. సరిపడే వరుడు లేదా వధువును ఎంపిక చేయడం.., కుటుంబాల మధ్య సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి సేవలను వేగవంతంగా నిర్వహిస్తున్నాయి. సంబంధం కుదిరిన తర్వాత ఎక్కువ సమయం తీసుకుంటే అనవసర అపోహలు, అభిప్రాయ భేదాలు లేదా పరిస్థితుల మార్పు వచ్చే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఉద్యోగ మార్పులు, విదేశీ ప్రయాణాలు, కుటుంబ పరిస్థితుల్లో మార్పులు లేదా ఇతర కారణాలతో సంబంధాలు చివరి నిమిషంలో రద్దు కావడం కూడా జరుగుతుండటంతో, వీలైనంత త్వరగా వివాహం జరిపించడమే మంచిదని అనేక కుటుంబాలు భావిస్తున్నాయి.

ముహూర్తం కోసం వేట..!
వివాహ ముహూర్తాలు నిర్ణయించే పురోహితులు కూడా ఇటీవల త్వరితగతిన ముహూర్తం కావాలని కోరే కుటుంబాల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. సంబంధం ఖరారైన వెంటనే అందుబాటులో ఉన్న సమీప ముహూర్తాన్ని సూచించాలని.. ఎక్కువ ఆలస్యం చేయవద్దని చాలామంది కోరుతున్నారని వారు పేర్కొంటున్నారు. దీంతో సమీప తేదీలకు ముహూర్తాల కోసం డిమాండ్ కూడా పెరుగుతోంది.

ఇది కరెక్టేనా?
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేగంగా వివాహం జరగడం తప్పు కాదు. కానీ నిర్ణయం ఒత్తిడిలో కాకుండా పరస్పర సమ్మతితో, ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత తీసుకోవాలి. పెళ్లికి ముందు తగినంత సంభాషణ, భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టత ఉండటం దాంపత్య జీవితాన్ని మరింత బలపరుస్తుందని వారు సూచిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే వివాహాల విషయంలో సమాజం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి తరం వరకు ఉద్యోగాలు, కెరీర్ విషయాన్ని ఆలోచించిన వారు ఇప్పుడు స్థిరపడిన వెంటనే కుటుంబ జీవితాన్ని కూడా సెట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు ఆలస్యంగా.. ఆడంబరంగా కాకుండా సింపుల్ మ్యారేజేస్ పై ఆసక్తి చూపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper