Telugu Director: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. పైకి నవ్వుతూ కనిపించినంత మాత్రాన ఇక్కడ అందరూ హ్యాపీ ఉన్నారు అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. మొత్తానికైతే వాళ్ళు సినిమాను నమ్ముకొని తిని తినక పస్తులుండి చాలా సంవత్సరాలుగా ఒక అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకి ఒక్క అవకాశం వస్తే చాలు మమ్మల్ని మేము నిరూపించుకోవచ్చు అనే ధోరణిలో ఎప్పటికప్పుడు వాళ్లు తమ టాలెంట్ ను ఎలివేట్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక అలాంటి క్రమంలోనే ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అజయ్ భూపతి సైతం కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే తన మొదటి సినిమా స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ నాన్నకి హెల్త్ బాలేకపోవడంతో ఆయన చాలావరకు సఫర్ అయ్యారట. ఒక పక్క ‘ఆర్ఎక్స్ 100’ స్టోరీ నేరేషన్స్ ఇస్తూనే వాళ్ళ నాన్నని హాస్పిటల్ లో చూపిస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నారట.
మొత్తానికైతే ఆర్ఎక్స్ 100 సినిమాకి గాని నీకు ఎంత రెమినేషన్ కావాలి అని ప్రొడ్యూసర్ అడిగినప్పుడు మా నాన్న హస్పటల్ ఖర్చులకు అయ్యే అంత డబ్బులు ఇస్తే చాలని నాకు ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ ఏమి ఇవ్వాల్సిన పనిలేదని చెప్పారట. దాంతో ప్రొడ్యూసర్ సైతం ఓకే అన్నాడు.
ఇక మొత్తానికైతే అలా వాళ్ళ నాన్న హాస్పిట్ కి అయ్యే ఖర్చులను భరిస్తూ సినిమా చేశాడు. ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఒక రెండు నెలల పాటు వాళ్ళ నాన్న బతికే ఉన్నారట. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించాడు అంటూ అజయ్ భూపతి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…
మొత్తానికైతే అజయ్ భూపతి ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్బా రిలీజ్ అయిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన తొందరలోనే ‘మంగళవారం 2’ తో మరోసారి ప్రేక్షకులను పలకరించాలని చూస్తున్నాడు. ఆ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయగలుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు…