Homeఎంటర్టైన్మెంట్Ajay Bhupathi: అక్కినేని నాగార్జున కి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి.. అసలు ఏమైందంటే..

Ajay Bhupathi: అక్కినేని నాగార్జున కి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి.. అసలు ఏమైందంటే..

Ajay Bhupathi: రీసెంట్ గానే ‘లెనిన్’ మూవీ సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున సినిమాలు ఎందుకు ఆలస్యం గా తీస్తున్నారు అనే అంశం పై పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. తన లెనిన్ టీం తో పాటు , ఇండస్ట్రీ లో ఆలస్యం గా సినిమాలను అందిస్తున్న ప్రతీ టెక్నీషియన్ ని ఆలోచింపజేసేలా ఆయన ప్రసంగం ఉండేది. గతం లో మేము ఒక సినిమా విడుదల తేదీని ప్రకటిస్తే , నెల రోజుల ముందే […]

Ajay Bhupathi: రీసెంట్ గానే ‘లెనిన్’ మూవీ సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున సినిమాలు ఎందుకు ఆలస్యం గా తీస్తున్నారు అనే అంశం పై పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. తన లెనిన్ టీం తో పాటు , ఇండస్ట్రీ లో ఆలస్యం గా సినిమాలను అందిస్తున్న ప్రతీ టెక్నీషియన్ ని ఆలోచింపజేసేలా ఆయన ప్రసంగం ఉండేది. గతం లో మేము ఒక సినిమా విడుదల తేదీని ప్రకటిస్తే , నెల రోజుల ముందే ఫైనల్ కాపీ ని చూసేవాళ్ళం. కానీ విడుదల తేదీని ఒకసారి ప్రకటించిన తర్వాత నాలుగైదు సార్లు మార్చాల్సి వస్తుంది. హాలీవుడ్ లో ‘ది ఒడిస్సీ’ సినిమా విడుదల తేదీని సంవత్సరం ముందే ప్రకటించారు. చెప్పిన తేదికి ఆ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. కానీ మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం?, ఎక్కడ తప్పు జరుగుతోంది అంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ సినిమా షూటింగ్స్ విధానాన్ని మన తెలుగు సినీ పరిశ్రమతో పోల్చడం సరికాదు. అక్కడ ముందుగా షూటింగ్ ని పూర్తి చేస్తారు , ఆ తర్వాత విడుదల తేదీని చాలా ముందుగానే ప్రకటిస్తారు. కానీ వాళ్ళతో పోలిస్తే మన దగ్గర నిర్మాతల దగ్గర అంత డబ్బులు ఉండవు. వాళ్ళ ఆర్ధిక పరిస్థితి కి సాధ్యం అవ్వదు. ఇప్పుడు మన ఆడియన్స్ క్వాలిటీ ని గమనించి సినిమాలకు కదులుతున్నారు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కోసం అత్యధిక సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఫస్ట్ కాపీ సిద్దమైన మూడు నెలలకు విడుదల తేదీని ప్రకటించాలి. అప్పుడు ప్రొమోషన్స్ కి కూడా కావాల్సినంత సమయం దొరుకుంటుంది’ అంటూ అజయ్ భూపతి చెప్పుకొచ్చారు.

ఈయన చెప్పిన దాంట్లో కూడా ఎంతో కొంత లాజిక్ ఉంది కానీ , హాలీవుడ్ లో క్వాలిటీ సినిమాలను కూడా చెప్పిన సమయం లో విడుదల చేస్తున్నారు కదా, మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాదు, త్వరలో వాళ్ళతో పోటీ పడే సినిమాలు మన ఇండస్ట్రీ నుండి రాబోతున్నాయి. అలాంటప్పుడు విడుదల తేదీలను కూడా చెప్పిన తేదికి తీసుకొని వచ్చే విషయంపై కసరత్తు చేస్తే ఇది అసాధ్యమైన విషయం కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు . ఇకపోతే అజయ్ భూపతి దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘శ్రీనివాస మంగపురం’ ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఈ చిత్రం ద్వారా హీరో గా వెండితెర కి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper