Chiranjeevi : 5 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన జానర్స్ లో కనిపించారు. ఆయన రేంజ్ జానర్స్ ఏ హీరో చెయ్యలేదని చెప్పాలి. కమర్షియల్ యాక్షన్ హీరో గా యాక్షన్ జానర్ సినిమాలు , హృదయాలను పిండేసే ఫ్యామిలీ జానర్ సినిమాలు, పొట్టచెక్కలు అయ్యే రేంజ్ లో కామెడీ జానర్ సినిమాలు , మధ్యలో కొన్ని ఫాంటసీ జానర్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు ఇలా ఒక్కటా రెండా దాదాపుగా అన్ని జానర్ సినిమాల్లోనూ ఆయన నటించాడు. ఒక్క హారర్ జానర్ తప్ప. చిరంజీవి మాస్ ఇమేజ్ కి అలాంటి జానర్ సినిమాలు సరిపడవు అనే ఉద్దేశ్యం తో డైరెక్టర్స్ ఆయనతో అలాంటి సినిమాలు చేయడానికి సాహసం చేసి ఉండకపోవచ్చు. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. హీరో ఇమేజ్ ని చూడకుండా, కేవలం సినిమాని సినిమా లాగానే చూసే రోజులివి.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హారర్ జానర్ చిత్రం లో నటించాలని మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మెగా అభిమానుల సంగతి కాసేపు పక్కన పెడితే , లక్కీ భాస్కర్ , సార్, లేటెస్ట్ గా విశ్వనాధ్ & సన్స్ లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక హారర్ జానర్ సినిమాని సిద్ధం చేసాడట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ ‘ చిరంజీవి గారి కోసం నేను ఒక హారర్ సబ్జెక్టు ని రెడీ చేశాను . కానీ ఎందుకో నాకు ఆయన స్టార్ ఇమేజ్ కి అది సెట్ అవ్వదు అనిపించి డ్రాప్ అయ్యాను. ఆయన ఇమేజ్ కి తగ్గ సినిమానే చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు వెంకీ అట్లూరి.
అయితే మెగాస్టార్ మాస్ ఇమేజ్ కి హారర్ జానర్ చిత్రం సూట్ అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే ప్రస్తుతం థియేటర్స్ కి వెళ్లి చూసేది జెన్ జీ ఆడియన్స్. వాళ్లకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇస్తే చాలు , ఎలాంటి జానర్ సినిమాని అయినా ఆదరిస్తారు. అలా ఆయన ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అయితే ప్రభాస్ ‘రాజా సాబ్’ కూడా హారర్ జానర్ కదా , పెద్ద ఫ్లాప్ అయ్యింది అని మీరు అనుకోవచ్చు. ఆ చిత్రాన్ని డైరెక్టర్ తీసిన విధానం బాగాలేదు , కంటెంట్ బాగోలేక ప్లాప్ అయ్యింది కానీ, ‘విరూపాక్ష’ తరహాలో సరైన హారర్ థ్రిల్లింగ్ అనుభూతిని అందించి ఉండుంటే , ఆ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఉండేది. కాబట్టి మంచి కథ తో రావాలంతే, ఆడియన్స్ బ్రహ్మరధం పట్టేస్తారు.