Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story : 'చెన్నై లవ్ స్టోరీ' 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఏకంగా ‘లెనిన్’ నే దాటేసిందిగా..

Chennai Love Story కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట బ్లాక్ బస్టర్ వసూళ్లతో ముందుకు దూసుకుపోతూ కేవలం మూడు రోజుల్లోనే క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చిన విషయం వాస్తవమే కానీ , ఈ చిత్రం లోని ఎమోషన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం తో , బాక్స్ […]

Chennai Love Story కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట బ్లాక్ బస్టర్ వసూళ్లతో ముందుకు దూసుకుపోతూ కేవలం మూడు రోజుల్లోనే క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చిన విషయం వాస్తవమే కానీ , ఈ చిత్రం లోని ఎమోషన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం తో , బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలు కూడా ఊహించని రేంజ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. రోజువారీగా వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి నమోదయ్యే వసూళ్లు ‘లెనిన్’ ని మించి ఉన్నాయి. లెనిన్ చిత్రానికి 5 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి 5 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 6 కోట్ల 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ చిత్రానికి 5 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 14 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 24 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 18 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 33 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. విడుదలకు ముందు 14 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే , ఇప్పటి వరకు 4 కోట్ల 45 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. అన్నీ ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది కానీ , ఓవర్సీస్ లో మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే , బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం అసాధ్యం అని అనిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper