Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story : 'చెన్నై లవ్ స్టోరీ' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ మార్కుకి అతి చేరువలో..

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బంపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టిన సినిమాగా అరుదైన రికార్డు ని నెలకొల్పింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు వచ్చిన వసూళ్లకంటే , రెండవ రోజు వసూళ్లు ఎక్కువ అట. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 4 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 8 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు 4 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 8 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొదటి రోజు 3 కోట్ల 10 లక్షల రూపాయిలు రాగా, రెండవ రోజు 3 కోట్ల 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 6 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 16 లక్షలు , సీడెడ్ ప్రాంతం నుండి 1 కోటి 2 లక్షలు , ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 1 కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 9 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 16 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నేటితో 97 శాతం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది , రేపటి తో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది. ఇక ఆ తర్వాత ఎంత షేర్ వసూళ్లు వచ్చినా లాభాలే. బేబీ తర్వాత ఆ సినిమా మేకర్స్ కి మరో భారీ బ్లాక్ బస్టర్ వచ్చినట్టు అయ్యింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jana Nayagan Advance Bookings

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party : ఎగతాళి నుంచి పుట్టి.. ఎదురొడ్డి పోరాడి..

Cockroach Janata Party : ఇటీవలి కాలంలో భారత రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించింది. సంప్రదాయ పార్టీలను అధిగమించి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు కోట్ల మంది అనుచరులను సంపాదించుకున్న కాక్రోచ్‌ జనతా పార్టీ...
Today 26 February 2026 Horoscope

Today horoscope in telugu 27.7.2026 : ఈ నాలుగు రాశుల వారు అదృష్టవంతులు..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Cockroach Janata Party Funding : కాక్రోచ్ జనతా పార్టీకి ఫండ్.. “లెక్క” భారీగానే ఉందిగా..

Cockroach Janata Party Funding : కావలసినంత ఆహారం వచ్చింది. డ్రై ఫ్రూట్స్ ఊహించని విధంగా వచ్చాయి. మెడికల్ కిట్లు.. ఫాస్ట్ ఫుడ్.. డ్రింక్స్.. టెంట్లు.. రాళ్లు.. రప్పలు.. ఇవన్నీ ఆకాశరామన్న పంపించినట్టు...

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Oktelugu Epaper