Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story 6 Days Collections: 'చెన్నై లవ్ స్టోరీ' 6 రోజుల వరల్డ్...

Chennai Love Story 6 Days Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత గ్రాస్ కలలో కూడా ఊహించి ఉండరు..

Chennai Love Story 6 Days Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ ‘ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని సంపాదించి , క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఆరంభం లో సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుల నుండి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా […]

Chennai Love Story 6 Days Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ ‘ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని సంపాదించి , క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఆరంభం లో సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుల నుండి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడం తో , వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ , బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపిస్తూ ముందుకు వెళ్తోంది. 6 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 6 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 6 రోజుల్లో 16 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లుయ్ , 26 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 7 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాఘవం, సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ లో ఒక లవ్ స్టోరీ కి , అది కూడా మీడియం రేంజ్ హీరో కి ఈ రేంజ్ షేర్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర తో పాటు , కోస్తాంధ్ర లోని ఉభయ గోదావరి జిల్లాలు , కృష్ణ , గుంటూరు జిల్లాలతో పాటు , నెల్లూరు జిల్లా కలుపుకొని ఈ చిత్రానికి 6 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ విషయానికి వస్తే కర్ణాటక + తమిళనాడు + ఇతర రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 1 కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 2 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 20 కోట్ల షేర్ వసూళ్లు , 36 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి ఇప్పటి వరకు వచ్చాయి. ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper