Chennai Love Story 4 Days Collection: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ భారీ అంచనాల నడుమ విడుదలై భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, వీకెండ్ లోపు 97 శాతం కి పైగా రీకవరీ ని సాధించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. భారీ వీకెండ్ తర్వాత డ్రాప్స్ ఎలాంటి సినిమాకు అయినా సహజం. కానీ ఈ చిత్రానికి నాల్గవ రోజున తొలి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ముందు రోజుతో 50 శాతం కి పైగా హోల్డ్ సొంతమైంది. ఒక మీడియం రేంజ్ హీరోకి వర్కింగ్ డే లో ఈ రేంజ్ హోల్డ్ ఉండడం చాలా అరుదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి 4 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి.
మొత్తం మీద నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి నాలుగు రోజుల్లో 5 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది చిన్న విషయం కాదు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అవ్వగా , ఆంధ్ర ప్రాంతం నుండి 5 కోట్ల 2 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 12 కోట్ల 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 21 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో నమోదైన వసూళ్లను ఒకసారి పరిశీలించి చూద్దాం.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల నుండి ఈ చిత్రానికి 1 కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అవ్వగా, ఓవర్సీస్ నుండి 2 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 16 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం 2 కోట్ల 25 లక్షల రూపాయిల లాభాలను అందుకుంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాలి.