Homeఎంటర్టైన్మెంట్Kiran Abbavaram: సెల్ఫీ అడిగిన అభిమానిపై చిరాకు పడ్డ కిరణ్ అబ్బవరం..వీడియో వైరల్..

Kiran Abbavaram: సెల్ఫీ అడిగిన అభిమానిపై చిరాకు పడ్డ కిరణ్ అబ్బవరం..వీడియో వైరల్..

Kiran Abbavaram: అందరిలాగానే సినీ సెలబ్రిటీలకు కూడా జనాలతో కలిసి సినిమాలు చూడాలనే కోరిక ఉంటుంది. థియేటర్స్ లో ప్రేక్షకులు వేసే ఈలలు , చప్పట్లు మధ్య సినిమా చూస్తే వచ్చే కిక్ ని సెలబ్రిటీలు కూడా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమ సినిమాలను తామే ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసే అవకాశం రావడం వాళ్ళు గొప్ప అదృష్టం గా భావిస్తుంటారు. కానీ సెలబ్రిటీలు అవ్వడం కారణంగా అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్వేచ్ఛగా సినిమా […]

Kiran Abbavaram: అందరిలాగానే సినీ సెలబ్రిటీలకు కూడా జనాలతో కలిసి సినిమాలు చూడాలనే కోరిక ఉంటుంది. థియేటర్స్ లో ప్రేక్షకులు వేసే ఈలలు , చప్పట్లు మధ్య సినిమా చూస్తే వచ్చే కిక్ ని సెలబ్రిటీలు కూడా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమ సినిమాలను తామే ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసే అవకాశం రావడం వాళ్ళు గొప్ప అదృష్టం గా భావిస్తుంటారు. కానీ సెలబ్రిటీలు అవ్వడం కారణంగా అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్వేచ్ఛగా సినిమా చూసే అవకాశం రాదు. బయట కనిపిస్తే సెల్ఫీలు అంటూ , షేక్ హ్యాండ్ లు అంటూ మీదకు ఎగబడుతుంటారు. అలా ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానుల కారణంగా తీవ్రమైన ఇబ్బందులకు గురైన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

ఆయన హీరో గా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , కేవలం వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని పొంది క్లీన్ హిట్ స్టేటస్ ని అందుకుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో ని చూసేందుకు కిరణ్ అబ్బవరం తన సతీమణి రహస్య తో కలిసి ప్రసాద్ మల్టీ ప్లెక్స్ కి విచ్చేశారు. ఆయన తో పాటు మూవీ టీం కూడా ఈ ప్రీమియర్ షో ని వీక్షించింది. అయితే సినిమాని చూసి బయటకు వస్తున్న సమయం లో కిరణ్ అబ్బవరం అభిమానులకు కనబడడంతో ఒక్కసారిగా ఆయన వైపు దూసుకొచ్చారు. ఒక అభిమాని అయితే కిరణ్ తో చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. అయితే తోపులాట ఎక్కువ అవ్వడం తో , ఆ అభిమాని పై కిరణ్ అబ్బవరం చిరాకు పడాల్సి వచ్చింది. ‘ఒక్క సెల్ఫీ తీసుకుంటాను అన్నా’ అని పదే పదే అడగడం తో , ‘ఊరికే నన్ను అడగకు , సెల్ఫీ తీసుకొని వెళ్ళిపో’ అని అంటాడు కిరణ్ అబ్బవరం.

సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో లో కిరణ్ అబ్బవరం అభిమానితో ప్రవర్తించిన తీరుపై కొంతమంది నెటిజెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే , మరికొంతమంది నెటిజెన్స్ మాత్రం సమర్థిస్తున్నారు. ఆయన పరిస్థితి ని కూడా అర్థం చేసుకోవాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’ విషయానికి వస్తే , కేవలం 6 రోజుల్లోనే 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా , రాబోయే రోజుల్లో 30 కోట్ల షేర్ , 50 కోట్ల గ్రాస్ మార్కుని అందుకొని కిరణ్ అబ్బవరం కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలబడబోతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

 

View this post on Instagram

 

A post shared by Friday Talks (@fridaytalkstelugu)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper