Jabardasth Tanmay: ఈటీవీ లో గత 12 ఏళ్ళ నుండి ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్, డైరెక్టర్స్ ఇండస్ట్రీ ఓకే ఎంట్రీ ఇచ్చి నేడు ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, నరేష్ ఇలా ఒక్కరా ఇద్దరా, ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ లో ప్రత్యేకమైన స్థానం లో కొనసాగుతున్నారు. అయితే కొంతమంది మాత్రం , అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నారు, సినిమా అవకాశాలు కోసం , జీవితం లో మరో మెట్టు ఎక్కడం కోసం ఎంతో గట్టిగ ప్రయత్నం చేస్తున్నారు కానీ , అదృష్టం కలిసిరాక ఇప్పటికీ జబర్దస్త్ , శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో ఒకరు తన్మయ్. ఈమె కిరాక్ ఆర్ఫీ స్కిట్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.
అయితే రీసెంట్ ఈమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ,తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని విచారకరమైన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఒకడిని నేను చాలా గాఢంగా 8 ఏళ్ళు ప్రేమించాను. నేను ఎంతో కష్టపడి సంపాదించుకొని వచ్చిన డబ్బులతో , కేవలం నా కుటుంబాన్ని మాత్రమే కాదు , అతని కుటుంబాన్ని కూడా పోషించేదాన్ని. నన్ను ప్రేమించాడని అనుకోని నేను దారుణంగా మోసపోయాను. అతను ప్రేమించింది నన్ను కాదు , నేను సంపాదించే డబ్బుని. ఆ అనుభవం కారణంగా, అప్పటి నుండి ఈ ప్రేమ, పెళ్లి వంటి బంధాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను. అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కంటారు, తమ కుటుంబం తో ఎంతో సంతోషంగా జీవిస్తారు. కానీ మా లాంటి ట్రాన్స్ జెండర్స్ పరిసితి ఏంటి?, కుటుంబ సభ్యులు , స్నేహితులు, బంధువులు, ఇలా అందరూ మమ్మల్ని ద్వేషించేవాళ్లే’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘మమ్మల్ని చాలా చులకన గా చూస్తారు. కానీ అలా చూసిన వాళ్ళ జీవితాళ్లే బాగున్నాయి. సమాజంతో పాటు , సొంత తల్లిదండ్రులు కూడా మమ్మల్ని వేలి వేసినప్పుడు , ఎవడో ఒకడు మా జీవితాల్లోకి వచ్చి ప్రేమని చూపిస్తాడు. ఆ ప్రేమకి మేము బానిసలు అవుతుంటాము. చివరికి మాకు ఎదో ఒక సాకు చెప్పి మోసం చేసి మధ్యలోనే వదిలేసి వెళ్తారు. ట్రాన్స్ జెండర్ గా మారడం కోసం మూడు సార్లు చచ్చిబతికాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లలాగా ఉండాలి, నా తల్లిదండ్రులు నన్ను కూతురిగా చూసుకోవాలి అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది తన్మయ్.