Nukaraju: గత 13 ఏళ్ళ నుండి ఈటీవీ ఛానల్ లో దిగ్విజయంగా నడుస్తున్న షో ఏదైనా ఉందా అంటే అది జబర్దస్త్ మాత్రమే. తెలుగు బుల్లితెర పై సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిన బిగ్గెస్ట్ కామెడీ షో ఇది. ఈ షో ని చూసి ఇతర చానెల్స్ లో కూడా ఇదే తరహా కామెడీ షోస్ ని డిజైన్ చేశారు , సక్సెస్ అయ్యారు. అయితే జబర్దస్త్ నుండి టాప్ కమెడియన్స్ అందరూ ఒక్కొక్కరిగా వెళ్లిపోవడం తో , ఈ షో రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ఒకానొక దశలో ఈ షో ఆగిపోతుందేమో అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆదివారానికి ఈ షో ని మార్చడం తో రేటింగ్స్ మళ్లీ పుంజుకున్నాయి. స్కిట్స్ లో కూడా ఈమధ్య కామెడీ బాగా పెరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది
ఈ ప్రోమో లో నూకరాజు , బులెట్ భాస్కర్ మధ్య జరిగిన సంభాషణ , ఆ సంభాషణ లో వచ్చిన పంచులు బాగా హైలైట్ అయ్యాయి. ఛాతికి రావాల్సిన ఈవెంట్స్ అన్నిటిని బులెట్ భాస్కర్ దోచేసాడని , కానీ ఎప్పుడైనా చంటి బులెట్ భాస్కర్ ని తన స్కిట్ లోకి రమ్మని కోరితే రోజుకి 60 వేల రూపాయిలు అడుగుతాడని , అంతే కాకుండా కేరవాన్ కూడా పెట్టమంటాడని నూకరాజు వేసిన పంచులు హైలైట్ అయ్యాయి. అందుకు చలాకి చంటి రియాక్షన్స్ ఏంటో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. ఆద్యంతం ఫన్ తో నిండిపోయిన ఈ స్కిట్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క హైపర్ ఆది , దొరబాబు వంటి వారు జనసేన పార్టీ తరుపున స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం లో ఉండడం విశేషం.