Akhil Akkineni: సుకుమార్ శిష్యుడిగా ‘ఉప్పెన’ చిత్రం తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా బుచ్చి బాబు , మొదటి సినిమాతోనే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఏకంగా రామ్ చరణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో ‘పెద్ది’ చిత్రం చేసే అరుదైన అదృష్టం కలిగింది. అంత పెద్ద సూపర్ స్టార్ ని బుచ్చి బాబు హ్యాండిల్ చేయగలరా?, ఈయన కూడా డైరెక్టర్ మారుతీ లాగా చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ‘పెద్ది’ చిత్రాన్ని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా తెరకెక్కించారు. ‘గేమ్ చేంజర్ ‘ తో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న రామ్ చరణ్ కి , ‘పెద్ది’ ద్వారా 350 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే రేంజ్ కి తీసుకొచ్చారు.
అంతే కాదు రామ్ చరణ్ తో మరో సినిమా చేసే అవకాశం కూడా కొట్టేశారు బుచ్చి బాబు. రీసెంట్ గానే ఒక ప్రముఖ నిర్మాతతో బుచ్చి బాబు కి అడ్వాన్స్ కూడా ఇప్పించారట రామ్ చరణ్. ఇది కాసేపు పక్కన పెడితే , ఇప్పుడు బుచ్చి బాబు కి మరో ప్రాజెక్ట్ కూడా లాక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ తో ఒక సినిమా చేయాల్సిందిగా స్వయంగా అక్కినేని నాగార్జున బుచ్చి బాబు ని అడిగారట. అందుకు బుచ్చి బాబు కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే అఖిల్ ని కలిసి ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు ని వినిపించే పనిలో ఉన్నారట బుచ్చి బాబు. మొదటి మూవీ లవ్ స్టోరీ జానర్ , 2 వ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ జానర్, ఇప్పుడు అఖిల్ తో చేయబోయే సినిమా మైథలాజికల్ టచ్ ఉన్న జానర్ అట.
‘పెద్ది’ తర్వాత ఆయన తదుపరి చిత్రం ఇదే కావొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ మరో రెండేళ్ల వరకు సుకుమార్ మూవీ తో ఫుల్ బిజీ గా ఉంటారు. ఈ రెండేళ్ల గ్యాప్ లో బుచ్చి బాబు ఖాళీగా అయితే ఉండలేరు కదా, అందుకే అఖిల్ తో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. మరో పక్క బుచ్చి బాబు మహేష్ బాబు తో కూడా ఒక సినిమాని రీసెంట్ గానే ఫైనల్ చేసుకున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో బుచ్చి బాబు పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అఖిల్ తో చేయబోయే సినిమా కూడా ఆయన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగుతుందో లేదో చూడాలి.
