Bigg Boss 10 Telugu: ఈ సీజన్ లో ‘బిగ్ బాస్’ టీం చాలా అన్యాయం చేస్తుందనే భావన ప్రతీ ప్రేక్షకుడిలో కలుగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఒక కామనర్ టైటిల్ విన్నర్ గా నిలబడకూడదు, ఇలా జరిగితే ‘బిగ్ బాస్’ రియాలిటీ షో మనుగడ సాగడం కష్టమే అనే భావన బిగ్ బాస్ టీం లో కలిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదట. గత సీజన్ ప్రభావం ఈ సీజన్ పై చాలా గట్టిగానే పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా వచ్చిన కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచాడు, అదే అగ్ని పరీక్ష నుండి వచ్చిన డిమోన్ పవన్ టాప్ 3 గా నిలిచాడు, అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరించిన ఇమ్మానుయేల్ మాత్రం టాప్ 4 గా మిగిలాడు.
దీంతో సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొనేందుకు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. కామనర్స్ ‘అగ్ని పరీక్ష’ షో నుండి బలమైన ఓటు బ్యాంక్ ని ఏర్పాటు చేసుకొని వస్తున్నారు. ఆ కారణం చేత సెలబ్రిటీస్ వాళ్ళని అందుకోలేకపోతున్నారు, రాబోయే సీజన్ కి కూడా అదే జరుగుతుంది , ఈ షో కి వెళ్లి మన సమయాన్ని వృధా చేసుకోవడం దందాగా అనే అభిప్రాయానికి సెలబ్రిటీలు వచ్చేసారు. ఈ సీజన్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీం చాలా గట్టి ప్రయత్నాలే చేసింది , కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక సీజన్ మొదలయ్యాక రోహిత్ మేనియా సోషల్ మీడియా లో వన్ సైడెడ్ గా ఉండడం చూసి , వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చేందుకు అసలు ఆసక్తి చూపించలేదు. అందుకే వేరే దారి లేక ‘అగ్ని పరీక్ష 2’ నుండి రామకృష్ణ ని తీసుకున్నారు. 6 మంది కంటెస్టెంట్స్ ని తీసుకొని రావాలని అనుకుంటే , కేవలం 5 మంది మాత్రమే వచ్చారు.
ఇది బిగ్ బాస్ టీం ని బాగా హర్ట్ చేసిందని అంటున్నారు నెటిజెన్స్. అందుకే రోహిత్ మేనియా ని ఎలా అయినా తగ్గించాలి , త్రిగున్ ని పైకి లాగాలని బలంగా అనుకున్నారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారమే మొదటి వారం నుండే రోహిత్ ని వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున చేత టార్గెట్ చేయించడం మొదలు పెట్టారు. రోహిత్ చేసిన చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేసి చూపిస్తూ , అతన్ని ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. ముఖ్యంగా నాల్గవ వారం లో రోహిత్ పెద్దగా తప్పులు చేయలేదు. ఈ వారం నాగార్జున కోటింగ్ నుండి తప్పించుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ లైవ్ లో , టీవీ టెలికాస్ట్ లో కూడా చూపించకుండా, చరణ్ తో రోహిత్ సరదాగా మాట్లాడిన మాటలను చూపించి , బిగ్ బాస్ ని అగౌరవపరిచాడు అనేలా ప్రొజెక్ట్ చేశారు. చెయ్యని తప్పుకి అతని చేత క్షమాపణలు చెప్పించేలా చేశారు. ఆ ఎపిసోడ్ తో రోహిత్ గ్రాఫ్ తగ్గుతుందని ఆశించారు. కానీ అది జరగలేదు , ఇంకా అతని గ్రాఫ్ పెరిగింది.
దీంతో బిగ్ బాస్ టీం కి ఏమి చేస్తే రోహిత్ తగ్గుతాడో అర్థం అవ్వలేదు. గత వారం కూడా నాగార్జున రోహిత్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేసాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినప్పటికీ కూడా రోహిత్ గ్రాఫ్ అందనంత ఎత్తులో ఉంది. దీంతో బిగ్ బాస్ టీం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ వారం మొత్తం రోహిత్ ని గేమ్స్ ఆడనివ్వకుండా చేసి, త్రిగున్ ని టాస్కుల్లో పాల్గొనేలా చేసి , అతన్ని పైకి లేపాలి అనుకుంది టీం. వాళ్ళు అనుకున్నట్టుగానే త్రిగున్ ఈ వారం టాస్కుల్లో బాగా షైన్ అయ్యాడు. రోహిత్ కి టాస్కులు ఆడే అవకాశం రాకపోవడం తో, అతనికి స్క్రీన్ స్పేస్ కూడా బాగా తగ్గిపోయింది. దీంతో దాదాపుగా 50 రోజుల పాటు నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ వచ్చిన రోహిత్ , ఒక్కసారిగా టాప్ 2 కి పడిపోయాడు. బిగ్ బాస్ టీం ఏదైతే చెయ్యాలని అనుకుందో అది చేసింది , సక్సెస్ సాధించింది. ఇప్పుడు రోహిత్ కంటే ఎక్కువ గా త్రిగున్ కి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ వచ్చే వారం కానీ , ఆ పై వారం లో కానీ , రోహిత్ కి సరైన టాస్కులు పడిన ఎపిసోడ్ ఒక్కటి తగిలితే చాలు , మళ్లీ రోహిత్ గ్రాఫ్ ని అందుకోవడం ఎవరి వల్ల కాదు, కచ్చితంగా టైటిల్ విన్నర్ గా నిలుస్తాడని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.