Bigg Boss 10 Telugu: ఈ బిగ్ బాస్ సీజన్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా మంచి హైప్ తో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ కి సరైన టాస్కులు ఆడే అవకాశం రావడం లేదు. సరిగ్గా కెప్టెన్సీ కంటెండర్ షిప్ సమయం లోనే సెలబ్రిటీలు ఆయన్ని తీసేస్తూ వస్తున్నారు. ఈ వారం అయితే సెలబ్రిటీలతో పాటు , బిగ్ బాస్ టీం కూడా రోహిత్ ని గేమ్స్ ఆడనివ్వకుండా సైలెంట్ గా పెట్టేసారు. ఆయన్ని రెడ్ బ్లాక్ లో పెట్టి , కేవలం ఒకే ఒక్క టాస్క్ ఆడించేలా చేశారు. ఆ టాస్క్ లో కూడా సెలబ్రిటీలు ఆయన్ని పీకేశారు. దీంతో ఈ వారం రోహిత్ కి తన ఆట ని చూపించుకుని అవకాశం దక్కలేదు. స్క్రీన్ స్పేస్ కూడా బాగా తగ్గిపోయింది. ఆ కారణం చేత ఆయన ఓటింగ్ బాగా తగ్గింది.
గత వారం వరకు రోహిత్ , త్రిగున్ కి ఓటింగ్ శాతం తేడా చాలా ఉండేది. కానీ ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య ఓటింగ్ తేడా 5 శాతం మాత్రమే ఉంది. వార్ వన్ సైడ్ లాగా వెళ్తున్న సీజన్ ని , ఇద్దరి మధ్య టఫ్ పోటీ వచ్చేలా చేయడం లో బిగ్ బాస్ టీం ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. మొదటి వారం నుండి ఇప్పటి వరకు ప్రతీ వీకెండ్ లో నాగార్జున పనిగట్టుకొని రోహిత్ ని టార్గెట్ చేస్తూ , అతను చేసిన చిన్న తప్పు ని కూడా భూతద్దం లో చూపించి నెగటివ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నెగెటివ్ చేసినా ఓటింగ్ లో ఎలాంటి మార్పు లేదు , వార్ వన్ సైడ్ గానే వెళ్తోంది. అందుకే ఈ వారం ఆయన్ని రెడ్ జోన్ లో పెట్టారు. ఆ జోన్ లో ఉన్నప్పుడు టాస్క్ కూడా అతనికి వ్యతిరేకంగానే ఉంది.
ఎందుకంటే సెలబ్రిటీలు ఈ టాస్క్ నుండి రోహిత్ ని చాలా తేలికగా తీసి పక్కన పెట్టేస్తారు అనే నమ్మకం బిగ్ బాస్ టీం కి ఉండడం వల్లే ఇలా చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే రోహిత్ ని మొదటి రెండు రౌండ్స్ కే తీసేసారు. ఆ తర్వాత ఎల్లో జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి టాస్కులు నిర్వహించారు. ఈ టాస్కుల్లో ముకేశ్ , త్రిగున్ , అమన్ లకు చాలా మంచి పేరొచ్చింది. వాళ్ళ ఓటింగ్ శాతం బాగా పెరిగిపోయింది , రోహిత్ కి తగ్గిపోయింది. వచ్చే వారం కూడా రోహిత్ ని బిగ్ బాస్ టీం ఇలాగే తొక్కే ప్రయత్నం చేస్తే రోహిత్ టాప్ 2 కి పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.