Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' టీం పై సెటైర్లు విసిరిన రోహిత్..ఇది...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ టీం పై సెటైర్లు విసిరిన రోహిత్..ఇది మామూలు ర్యాగింగ్ కాదు!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ ‘బిగ్ బాస్’ టీం చాలా బయాస్ గా ఉందని సోషల్ మీడియా లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. సెలబ్రిటీలకు ఒక న్యాయం , అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్ కి మరో న్యాయం అన్నట్టుగా మొదటి ఎపిసోడ్ నుండి సాగుతోంది అంటూ నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత వీకెండ్ లో రోహిత్ , త్రిగున్ లకు విధించిన శిక్షలే అందుకు నిదర్శనం అని అంటున్నారు. ఇద్దరు హద్దులు దాటి […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ ‘బిగ్ బాస్’ టీం చాలా బయాస్ గా ఉందని సోషల్ మీడియా లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. సెలబ్రిటీలకు ఒక న్యాయం , అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్ కి మరో న్యాయం అన్నట్టుగా మొదటి ఎపిసోడ్ నుండి సాగుతోంది అంటూ నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత వీకెండ్ లో రోహిత్ , త్రిగున్ లకు విధించిన శిక్షలే అందుకు నిదర్శనం అని అంటున్నారు. ఇద్దరు హద్దులు దాటి ఒకరిని ఒకరు విమర్సించుకున్నారు, కానీ త్రిగున్ కి జైలు శిక్ష విధించారు, రోహిత్ కి అయితే సీజన్ మొత్తం కెప్టెన్సీ టాస్కులు ఆడేందుకు వీలు లేదని బ్లాక్ కార్డు ఇచ్చారు. రెండు శిక్షలకు మధ్య తేడా నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది. త్రిగున్ ని జైలు లో వేసారా అంటే అది కూడా చెయ్యలేదు.

అతని చేతికి రెండు బేడీలు వేసారంతే. స్వేచ్ఛగా ఇంట్లో తిరుగుతున్నాడు, నాగార్జున చెప్పిన జైలు ఎక్కడుందో ఆయనకే తెలియాలి. ఈ బేడీలు కూడా నామినేషన్స్ సమయం వరకే ఉంచారు , ఆ తర్వాత తీసేయమని బిగ్ బాస్ చెప్తాడు. ఒక ఆడపిల్ల ని నేషనల్ టెలివిజన్ లో అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి పడే శిక్ష ఇదా?, చెయ్యని తప్పుకి రోహిత్ కి ఎల్లో కార్డు ఇచ్చారు, త్రిగున్ ఇన్ని తప్పులు చేసినప్పటికీ కూడా అతనికి ఇలాంటి సున్నితమైన శిక్ష ఇచ్చారు అనే భావన నెటిజెన్స్ లో ఉంది. స్టార్ మా ఛానల్ ని ట్యాగ్ చేసి నిలదీస్తున్నారు. కానీ జనాలు ఏమనుకున్నా మాకు సంబంధం లేదు , మాకు నచ్చినట్టు చేస్తాం అనే విధంగా బిగ్ బాస్ టీం వ్యవహరిస్తోంది. రోహిత్ కి కూడా బిగ్ బాస్ టీం పై చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ని నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ లో తీర్చుకున్నాడు.

త్రిగున్ రోహిత్ ని నామినేట్ చేస్తూ , అతని ప్రవర్తన ని తప్పుబట్టగా, నీలాగా దిగజారి మాట్లాడి ఉండుంటే , నాకు ఈపాటికి రెండు మూడు ఎల్లో కార్డులు వచ్చి ఉండేవి అని అంటాడు రోహిత్. అంటే త్రిగున్ ఎన్ని తప్పులు చేసినా అతనికి ఎల్లో కార్డ్స్ ఇవ్వరు , కానీ నాకు మాత్రం కొత్త కార్డులు కనిపెట్టి మరీ ఇస్తుంటారు అంటూ రోహిత్ చెప్పకనే చెప్పేసాడని అంటున్నారు నెటిజెన్స్. సరిగ్గా ఆడియన్స్ ఫీలింగ్స్ ని రోహిత్ ముందు పెట్టాడు , తెగించి బిగ్ బాస్ టీం ని తప్పు బట్టాడు అంటూ సోషల్ మీడియా లో రివ్యూయర్స్ అంటున్నారు. వాస్తవానికి అయితే నిన్నటి నామినేషన్స్ లో రోహిత్ డిఫెన్స్ వేరే లెవెల్ లో ఉంది , ఎక్కడా కూడా ఆయన గత వారం లో లాగా నోరు జారలేదు. కానీ బిగ్ బాస్ టీం అతన్ని మళ్లీ టార్గెట్ చెయ్యాలని అనుకుంటే , ఎల్లో కార్డ్స్ టాపిక్ ని తీసుకొచ్చి టార్గెట్ చేయొచ్చు , కానీ రోహిత్ కి ఈసారి డోర్లు తెరిస్తే మాత్రం అతను వెళ్లిపోయే ప్రమాదం ఉంది , టీఆర్ఫీ రేటింగ్స్ రిస్క్ లో పదుద్దేమో అనే భయం తో బిగ్ బాస్ టీం అలాంటి నిర్ణయం 99 శాతం తీసుకోదని అంటున్నారు నెటిజెన్స్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper