Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్ ను లేపేయడానికి ఇరాన్ స్కెచ్..ఇలా బయటపడింది..

Donald Trump: ట్రంప్ ను లేపేయడానికి ఇరాన్ స్కెచ్..ఇలా బయటపడింది..

Donald Trump: ఇరాన్ మీద ట్రంప్ కు ఎందుకంత కోపం. ఇరాన్ అంటేనే ట్రంప్ ఎందుకంత మండి పడుతున్నారు.. ఆ స్థాయిలో ఆగ్రహాన్ని ఎందుకు చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ దేశం మీద కూడా ట్రంప్ ఈ స్థాయిలో కోపాన్ని చూపించడం లేదు. ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం లేదు. తన ఆవేశాన్ని వెళ్ళగక్కడం లేదు. యూఎస్ ప్రెసిడెంట్ ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇలా చేయడం వెనక కారణమేంటి.. గ్లోబల్ మీడియాలో వస్తున్న కథనాలు ట్రంప్ లో ఉన్న […]

Donald Trump: ఇరాన్ మీద ట్రంప్ కు ఎందుకంత కోపం. ఇరాన్ అంటేనే ట్రంప్ ఎందుకంత మండి పడుతున్నారు.. ఆ స్థాయిలో ఆగ్రహాన్ని ఎందుకు చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ దేశం మీద కూడా ట్రంప్ ఈ స్థాయిలో కోపాన్ని చూపించడం లేదు. ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం లేదు. తన ఆవేశాన్ని వెళ్ళగక్కడం లేదు. యూఎస్ ప్రెసిడెంట్ ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇలా చేయడం వెనక కారణమేంటి.. గ్లోబల్ మీడియాలో వస్తున్న కథనాలు ట్రంప్ లో ఉన్న మరో కోణాన్ని.. ఇరాన్ మీద ఆయనకు ఉన్న అసలు కోపాన్ని బయటపెడుతున్నాయి.

ట్రంప్ ఇటీవల కాలంలో ఇరాన్ దేశానికి ప్రతిరోజు దీపావళి పండుగ చూపించారు. విపరీతంగా బాంబులు వేశారు. మిస్సైల్స్ కురిపించారు. అనేక ప్రాంతాలను ధ్వంసం చేశారు. వేలాదిమందిని చంపేశారు. ఇరాన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. ఇంకా చెప్పాలంటే ఇరాన్ దేశానికి ఎన్ని విధాలుగా చుక్కలు చూపించాలో.. అన్ని విధాలుగా చూపించేశారు. ఇంత చేసినప్పటికీ ట్రంప్ కోపం తగ్గడం లేదు. ఆయన ఆవేశం చల్లారడం లేదు. ఇరాన్ మీద ఆయన తన కోపాన్ని చూపిస్తూనే ఉన్నారు. మండిపడుతూనే ఉన్నారు. తాజాగా కూడా బాంబులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇరాన్ మీద ట్రంప్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఒక కారణం ఉంది. ఇరాన్ సుప్రీమ్ ను అమెరికా దళాలు చంపేశాయి. ఆ తర్వాత అదును కోసం ఇలా ఎదురుచూస్తోంది. ఈ క్షణమైనా సరే ట్రంప్ ను లేపేయాలని భావిస్తోంది. అందువల్లే ట్రంప్ ఇటీవల తన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించకుండా. దానికి బదులుగా వేరే విమానాన్ని ఎంచుకున్నారు. ట్రంప్ ను లేపేయడానికి ఇరాన్ స్కెచ్ వేసింది. అందుకే ట్రంప్ వేరే విమానంలో ప్రయాణించారు. వేగుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రంప్ భద్రతా అధికారులు ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన వెంటనే వేరే విమానంలోకి మారిపోయారు.

దీనిపై ఒక విలేకరి ప్రశ్నించగా..”నేను ఇరాన్ హిట్ లిస్టులో ఉన్నాను. అందువల్లే వేరే విమానంలో ప్రయాణించాను. ఇరాన్ చంపాలనుకుంటున్న వ్యక్తుల జాబితాలో నేను మొదటి స్థానంలో ఉన్నాను. కానీ నిన్ను దానిని పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నేను పని చేసుకుంటున్నాను. నా పనిని నేను ఉత్తమంగా చేస్తున్నాను. ఆ విషయం నాకు తెలుసు. నన్ను చంపాలనుకుంటున్న వాళ్లకు కూడా తెలుసు” అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఈ విషయం మీద తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆయన చెబుతున్నారు.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper