Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam 2: 'కార్తీక దీపం 2' నుండి తప్పుకున్న 'జోత్స్న'..కారణం ఏంటంటే!

Karthika Deepam 2: ‘కార్తీక దీపం 2’ నుండి తప్పుకున్న ‘జోత్స్న’..కారణం ఏంటంటే!

Karthika Deepam 2:  స్టార్ మా ఛానల్ లో ‘బాహుబలి’ లాంటి హిట్ ఏదైనా ఉందంటే అది ‘కార్తీక దీపం’ సీరియల్ మాత్రమే. ఈ సీరియల్ కి వచ్చినంత జనాదరణ ఈమధ్య కాలం లో ఏ సీరియల్ కి కూడా రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పిల్లలు , పెద్దవాళ్ళు అనే తేడా లేదు , ప్రతీ ఒక్కరు ఈ సీరియల్ ని ఎగబడి చూసేవారు. అలాంటి ఆదరణ దక్కింది కాబట్టే , రెండవ […]

Karthika Deepam 2:  స్టార్ మా ఛానల్ లో ‘బాహుబలి’ లాంటి హిట్ ఏదైనా ఉందంటే అది ‘కార్తీక దీపం’ సీరియల్ మాత్రమే. ఈ సీరియల్ కి వచ్చినంత జనాదరణ ఈమధ్య కాలం లో ఏ సీరియల్ కి కూడా రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పిల్లలు , పెద్దవాళ్ళు అనే తేడా లేదు , ప్రతీ ఒక్కరు ఈ సీరియల్ ని ఎగబడి చూసేవారు. అలాంటి ఆదరణ దక్కింది కాబట్టే , రెండవ సీజన్ ని కూడా మొదలు పెట్టారు. ఈ సీజన్ కి మొదటి సీజన్ రేంజ్ రెస్పాన్స్ అయితే రాలేదు కానీ , టాప్ 3 రేంజ్ లో టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. మొదటి సీజన్ లో మోనిత అనే విలన్ క్యారెక్టర్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

శోభా శెట్టి ఈ క్యారెక్టర్ చేసింది. ఈమె ఆ సీరియల్ లో వేసే విలన్ వేషాలను చూసినప్పుడు ఆడియన్స్ కి చంపేయాలి అనేంత కోపం వచ్చింది. ఒక విధంగా ఆ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో మోనిత క్యారెక్టర్ ఒకటి. అయితే ఈ సీజన్ లో జ్యోత్స్నా అనే విలన్ క్యారెక్టర్ కి కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. గాయత్రీ సింహాద్రి ఈ పాత్ర పోషించింది. ఈమె పండించిన విలనిజాన్ని ఆడియన్స్ ఫిదా అవ్వడం తో రెండు సార్లు ‘ఉత్తమ విలన్’ అవార్డు ని కూడా అందుకుంది. అయితే ఈమధ్య ఈ క్యారెక్టర్ ని పాజిటివ్ డైరెక్టర్. అప్పటి నుండి జ్యోత్స్నా క్యారెక్టర్ సీరియల్ లో కనిపించడం లేదు. జ్యోత్స్నా ఎక్కడికి వెళ్ళింది అనే కాన్సెప్ట్ మీదనే ప్రస్తుతానికి ఎపిసోడ్స్ ని నడిపిస్తున్నారు.

దీంతో ఆడియన్స్ లో జ్యోత్స్నా క్యారెక్టర్ ఏమైంది?, సీరియల్ నుండి తప్పించారా ? అని అంటున్నారు నెటిజెన్స్. మరికొంత మంది అయితే ఈ క్యారెక్టర్ చేస్తున్న గాయత్రీ కి ఆరోగ్యం సరిగా లేదని , అందుకే కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందని , ఆరోగ్యం బాగు అయ్యాక మళ్లీ సీరియల్ లో జాయిన్ అవుతుందని అంటున్నారు. కానీ ఈమె సోషల్ మీడియా లో ఎప్పటి లాగానే బాగా యాక్టీవ్ గా ఉంది. నేడు కూడా ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీలను అప్లోడ్ చేసింది , రీసెంట్ గా ఒక ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నది. దీంతో ఈమె ఈ సీరియల్ నుండి తప్పుకుంది అనే వార్తలకు బలం చేకూరింది. కొన్ని రోజులు జ్యోత్స్నా కనిపించకుండా పోయినట్టు చూపించి , రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు అదే క్యారెక్టర్ లో మరో ఆర్టిస్టు ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper