Homeఆంధ్రప్రదేశ్‌Jana Sena Party: జనసేనలో వైసీపీ కోవర్టులు..పవన్ తరిమేయాల్సిందే

Jana Sena Party: జనసేనలో వైసీపీ కోవర్టులు..పవన్ తరిమేయాల్సిందే

Jana Sena Party: స్థానిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి బలంగా ఉంది. ఈ మూడు పార్టీల మధ్య 2024 నుంచి ఇప్పటివరకు సయోధ్య బ్రహ్మాండంగా ఉంది. అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పడిన కూటమిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక వైసీపీ విష ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కూటమి బలంగా ఉన్నంతవరకు తాము ప్రజల్లో నిలబడలేమని వైసిపి నేతలు ఒక అంచనాకు వచ్చారు. అందువల్లే తాడేపల్లి కేంద్రంగా విష ప్రచారం ప్రారంభించారు. జనసేన ను పక్కకు […]

Jana Sena Party: స్థానిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి బలంగా ఉంది. ఈ మూడు పార్టీల మధ్య 2024 నుంచి ఇప్పటివరకు సయోధ్య బ్రహ్మాండంగా ఉంది. అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పడిన కూటమిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక వైసీపీ విష ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కూటమి బలంగా ఉన్నంతవరకు తాము ప్రజల్లో నిలబడలేమని వైసిపి నేతలు ఒక అంచనాకు వచ్చారు. అందువల్లే తాడేపల్లి కేంద్రంగా విష ప్రచారం ప్రారంభించారు.

జనసేన ను పక్కకు తప్పించాలని..

కూటమి నుంచి జనసేన ను పక్కకు తప్పించాలని కుట్రలకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత కాలంలో సీట్ల కేటాయింపు.. స్థానిక నాయకుల్లో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులను లక్ష్యంగా చేసుకొని విద్వేషాన్ని నాటుతున్నారు. ఈ క్రమంలో వైసిపికి అనుకూలంగా పనిచేసే ముసుగు సోషల్ మీడియా వీరులు రెచ్చిపోతున్నారు. వాస్తవానికి ప్రత్యక్షంగా చేయాల్సిన రాజకీయ యుద్ధాన్ని ముసుగు పోరాటం లాగా మార్చేశారు. తెర వెనుక ఉంటూ.. సామాజిక మాధ్యమాల ద్వారా అత్యంత నీచమైన ప్రచారాన్ని చేస్తున్నారు.

వారితో ఎత్తుగడలు

తమ విష ప్రచారానికి వైసీపీ నేతలు ముఖ్యంగా జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులను.. గతంలో టిడిపి తో విభేదాలు ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. వారితో ఎత్తుగడలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలను తప్పు పట్టే విధంగా వారితో కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని మొత్తం తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని.. ఆయన ప్రయోజనాల కోసం టిడిపి వద్ద తలపంచుకుంటున్నారని.. ఫేక్ అకౌంట్లతో ఒక ప్రణాళిక ప్రకారం దాడి చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాయిని.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. దీనివల్ల జనసేన నాయకుల్లో నైతికస్థైర్యం దెబ్బతింటుందని తాడేపల్లి నాయకులు అంచనా వేస్తున్నారు. చివరికి వైసీపీ నాయకుల ఫేక్ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్ళిందంటే.. వేగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో ఒక వాట్సాప్ ఛానల్ సృష్టించారు. కూటమి నుంచి జనసేన బయటికి వచ్చిందంటూ కల్పిత ప్రకటన చేశారు. దానిని విపరీతంగా వైరల్ చేశారు. దీంతో డిప్యూటీ సీఎంఓ నేరుగా రంగంలోకి దిగింది. క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీనిని బట్టి వైసీపీ లో ఉన్న సైబర్ విషం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కోవర్టులు ఉన్నారా?

వాస్తవానికి ఏకంగా డిప్యూటీ సీఎం పేరుతో వాట్సప్ ఛానల్ ఏర్పాటు చేయడం వెనుక బయట శత్రువులు మాత్రమే కాకుండా.. జనసేనలో ఉన్న ఇంటి దొంగలు కూడా కారణమని తెలుస్తోంది. ఆ ఇంటి దొంగలు వైసిపికి చెందిన వారని.. వారంతా కూడా పార్టీ నుంచి పక్కకు వచ్చి జనసేన కండువా కప్పుకొని.. వైసిపి ఎజెండాను మోస్తున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థలకు సంబంధించిన పదవులు దక్కకపోవడం.. ముడుపులు లభించకపోవడంతో కొందరు మాజీ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఇలాంటి అసంతృప్తికి బీజం వేస్తున్నారు. వాస్తవానికి బయటి దొంగల కంటే.. ఇంటి దొంగలతోనే ఎవరికైనా ప్రమాదం. అందువల్లే జనసేనలో ఉన్న అంతర్గత విషయాలకు వేరే రంగు పూసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోతే పార్టీ మునిగిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని

2024లో గెలిచిన నాటి నుంచి వైసీపీ పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది. కూటమిలో లేని అగాధాన్ని ఉందని ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ను బయటికి పంపించాలని కుట్రలకు శ్రీకారం చుడుతోంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు నడుం బిగించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వలేదు. దీంతో వైసిపికి దారుణమైన ఓటమి తప్పలేదు. అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే తాము తేలికగా అధికారంలోకి వస్తామని వైసిపి భ్రమపడుతోంది. అందువల్లే పవన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది. కేడర్ మధ్య చిచ్చు పెడుతోంది. ఈ చర్యల ద్వారా వారి బంధాన్ని తుంచి వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో జనసేనలో ఉన్న కోవర్టు లను ఏరిపారేయాల్సిందే. తన్ని తరిమేయాల్సిందే. అలాంటి వ్యక్తులకు ఇంకా అవకాశాలు కల్పిస్తే జనసేన పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper