spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: నిఖిల్ బండారం మొత్తం బయటపెట్టిన సోనియా..ఇచ్చిపారేసిన యష్మీ..ఈరోజు ...

Bigg Boss Telugu 8: నిఖిల్ బండారం మొత్తం బయటపెట్టిన సోనియా..ఇచ్చిపారేసిన యష్మీ..ఈరోజు నామినేషన్స్ మామూలుగా ఉండదు!

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ అయిపోయింది. కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోపలకు వచ్చి బయట వీళ్ళ ఆట గురించి ఎలా వెళ్తుందో ఒక క్లారిటీ ఇచ్చారు. అందరూ తమ తప్పులను సరిచేసుకొని రేపటి నుండి ఎలా ఆడబోతున్నారో చూడాలి. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ చివర్లో వచ్చిన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో పాత కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు వచ్చి, ప్రస్తుతం ఆడుకుతున్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసి వెళ్లారు. ఒక్కో కంటెస్టెంట్ కి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం దక్కుతుంది. అందరికంటే ముందుగా శేఖర్ బాషా హౌస్ లోకి వచ్చాడని తెలిసింది కానీ, ప్రోమో లో మాత్రం సోనియా కి సంబంధించినదే చూపించారు. సోనియా ప్రేరణ, నిఖిల్ ని నామినేట్ చేసి వెళ్తుంది.

ముందుగా సోనియా మాట్లాడుతూ నా మొదటి నామినేషన్ ప్రేరణ బిగ్ బాస్ అంటుంది. అప్పుడు ప్రేరణ ‘వచ్చినావా అక్క’ అని అంటుంది. సోనియా దానికి బదులిస్తూ ‘చెప్పు చెల్లి’ అని అంటుంది. ఆ తర్వాత ప్రేరణ ‘నువ్వు నాకు అక్క కాదు’ అని అంటుంది. మరి ఎందుకు అక్క అని పిలిచావ్ అని అంటుంది సోనియా. నిఖిల్ కి అక్కవి అని చెప్తున్నాను అని ప్రేరణ అనగా, దానికి సోనియా సమాధానం ‘వాడికి నేను అక్కనో, చెల్లినో నీకు ఎందుకు..నువ్వు ఎందుకు ఇప్పుడు దానిని ఇక్కడికి తెచ్చావ్’ అని పెద్దగా అరిచి మాట్లాడుతుంది సోనియా. ఇక తర్వాత సోనియా నిఖిల్ ని నామినేట్ చేస్తూ ‘యష్మీ తన ఫీలింగ్స్ ని నీతో చెప్పినప్పుడు, నువ్వెందుకు ఆమెకు నీ బ్యాక్ స్టోరీ చెప్పలేదు’ అని అంటుంది. దానికి నిఖిల్ సమాధానం చెప్తూ ‘తనకి నా మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు నేను కట్ చేశా, ఆ అమ్మాయితో మాట్లాడడం లేదు కదా’ అని అంటాడు నిఖిల్.

దానికి యష్మీ ‘నువ్వు నిజంగా కట్ చేసావా’ అని నిఖిల్ ని అడుగుతుంది. దానికి ఆయన ‘ఇంతకు ముందు నీతో ఎప్పుడూ ఈ విషయం గురించి మాట్లాడలేదా?’ అని అడగగా, దానికి యష్మీ ‘నాకు నీ లవ్ స్టోరీ గురించి అసలు చెప్పలేదు..చెప్పి ఉంటే నీ వైపు కన్నెత్తి కూడా చూసేదానిని కాదు’ అని అంటుంది యష్మీ. గత వీకెండ్ ఎపిసోడ్ లో నిఖిల్ తన మాజీ ప్రేయసి కావ్య గురించి చెప్తూ, ఆమెతో బ్రేకప్ అయ్యిందని, ఆమెనే నా మనసులో ఉందని, బయటకి వెళ్లిన తర్వాత ఆమెతో కొట్లాడి అయినా సరే, నేను మళ్ళీ ప్యాచప్ అయిపోతాను అని అంటాడు నిఖిల్. ఈయన ఇప్పటి వరకు యష్మీ కి తన మనసులో కావ్య ఉంది అనే విషయం ఇప్పటి వరకు చెప్పలేదు. అందరితో పాటుగానే ఆమె కూడా తెలుసుకుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper