పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న హీరోల్లో ఒకరు రణవీర్ సింగ్. ఆయన కెరీర్ ని ‘ధురంధర్’ కి ముందు , ఆ తర్వాత అని విభజించవచ్చు. ఈ సినిమాకు ముందు కేవలం ఆయనొక సాధారణ హీరో మాత్రమే. ఈ సినిమా తర్వాత బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా అవతరించాడు. ‘ధురంధర్’ లాంటి సబ్జెక్టు ని ధైర్యం గా ఒప్పుకొని చేసినందుకు రణవీర్ సింగ్ అంటే అందరికీ ఎంతో గౌరవం. ఎందుకంటే బాలీవుడ్ లో దావూద్ కి వ్యతిరేకంగా సినిమాలు చేయడానికి ఎవ్వరూ సాహసం చెయ్యరు. అలాంటిది అతన్ని విలన్ గా చూపిస్తూ రణవీర్ సింగ్ సినిమా చేశాడంటే గొప్పే కదా. అయితే అలాంటి రణవీర్ సింగ్ పాకిస్థాన్ సంతతికి చెందినవాడు అంటూ ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ శేఖర్ బాషా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
శేఖర్ బాషా మాట్లాడుతూ ‘రణవీర్ సింగ్ నిజ జీవితం లో ఒక పాకిస్థాన్ సంతతి కి చెంది, ఇండియా కి వచ్చి ఉంటున్న వ్యక్తి. ఆయన గురించి గూగుల్ లో పరిశీలన చేస్తే మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అతను అమిల్ ఫ్యామిలీ కి చెందిన వాడు. అమిల్స్ బేస్ మొత్తం లాహోర్ లో ఉంటుంది. లాహోర్ , కరాచీ , పాకిస్థాన్ హైదరాబాద్ వీటి అన్నిటిని కలిపి సింధ్ అని పిలుస్తారు. ఈరోజు మన ‘జన గణ మన’ పాటలోని పంజాబ్ , సింధ్ , గుజరాత , మరాఠా అని అంటాము కదా , అందులో సింధ్ ఇక్కడ లేదు , పాకిస్థాన్ లో ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. మన హైదరాబాద్ లో కూడా సింధీ కాలనీ ఉంది. పాకిస్థాన్ మన నుండి దూరమైనా సమయం లో చాలా మంది ఉండలేక ఇక్కడికి వచ్చేశారు’.
‘ఈ సింధీస్ లో మూడు రకాల మనుషులు ఉండేవారు. సింధీస్ లో కొంతమంది ముఖ్యమైన పోస్టులు చేశారు. ముస్లిం రాజులు ఉన్నప్పటికీ బ్రిటీషర్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. వాళ్లనే పాకిస్థాన్ లో అమిల్స్ గ్రూప్ గా పిలుస్తుంటారు. రణవీర్ సింగ్ మాత్రమే కాదు , LK అద్వానీ కూడా అమిల్స్ సంతతి కి చెందివారు’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. అయితే శేఖర్ బాషా ఈ వ్యాఖ్యలు చేసినందుకు సోషల్ మీడియా లో ఆయనపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ కూడా ఒకప్పుడు మన భారత దేశం లో అంతర్భాగమే అనే విషయాన్ని ఇతను ఎలా మర్చిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న శేఖర్ బాషా మాట్లాడిన ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.