Seetha Payanam Collection: ఒకప్పుడు యాక్షన్ హీరో గా సౌత్ ఇండియా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో అర్జున్(Arjun Sarja). అందరూ ఆయన్ని యాక్షన్ కింగ్ అర్జున్ అని పిలిచేవారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈయనకు ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. తమిళం లో ఈయన హీరో గా నటించిన ఒకే ఒక్కడు, జెంటిల్ మ్యాన్ మరియు జైహింద్ వంటి సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత ఆయన నేరుగా తెలుగు లో చేసిన హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రావే చెల్లి వంటి చిత్రాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఇలా ఒక కమర్షియల్ హీరో గా ఎన్నో భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్న అర్జున్, ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కూడా.
ఆయన హీరో గా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘జైహింద్’ అనే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత దర్శకత్వం జోలికి కొన్నాళ్ళు పోలేదు. కేవలం నటన మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు. అయితే హీరో గా ఆయన మార్కెట్ బాగా దెబ్బ తిన్న తర్వాత, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఈమధ్య కాలంలో ఆయన పలు సినిమాల్లో విలన్ గా కూడా చేశాడు. అయితే చాలా కాలం తర్వాత ఆయనకు మరోసారి దర్శకత్వం వహించాలని కోరిక పుట్టింది. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని తెరకెక్కించాలని అనుకున్నాడు. అందుకు ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ ని ఎంచుకున్నాడు. అప్పట్లో షూటింగ్ ని కూడా మొదలు పెట్టారు కానీ చివరి నిమిషం లో విశ్వక్ సేన్ తప్పుకున్నాడు.
అప్పట్లో ఈ విషయం పై అర్జున్ ఫైర్ అయ్యి, విశ్వక్ సేన్ తీరుని తప్పుబడుతూ ఒక ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కన్నడ సూపర్ స్టార్స్ లో ఒకరైన ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ ని హీరో గా, తన కూతురు ఐశ్వర్య ని హీరోయిన్ గా పెట్టి ‘సీత పయనం’ అనే చిత్రం చేశాడు. రీసెంట్ గానే ఈ సినిమా విడుదలైంది. విడుదలకు ముందు అర్జున్ తన కూతురు ఐశ్వర్య తో కలిసి చాలా గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ట్రైలర్ తోనే అర్జున్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యాడు. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చెయ్యాల్సిన సినిమాని ఇప్పుడు చేస్తే ఎలా అంటూ ఈ ట్రైలర్ ని చూసిన వాళ్ళు కామెంట్స్ చేశారు. సినిమా విడుదల తర్వాత కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. దీంతో కమర్షియల్ గా ఈ చిత్రం చాలా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. కనీసం ప్రొమోషన్స్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అసలు షేర్ వసూళ్లే రాలేదట, కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చిందట.