Bigg Boss Agnipariksha 2: ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమి చేయడానికైనా రెడీ అన్నట్టుగా ఉంటూనే జీవితం లో విజయం సాధించగలం. వెనకడుగు అనే కాన్సెప్ట్ ఉండకూడదు , అది ఉంటే మాత్రం జీవితం లో పైకి ఎదగలేము. యువత నేర్చుకోవాల్సింది ఇదే. రీసెంట్ గా మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ లోని కంటెస్టెంట్స్ ని చూసి యువత స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ లో పాల్గొనడం ఒక కల. ఆ కల ని నెరవేర్చుకునేందుకు జడ్జీలు ఎంత అవమానించినా భరించారు, వాళ్ళు ఎంత కఠినమైన టాస్కులు నిర్వహించినా కాదు అనకుండా చేస్తున్నారు. ఎలా అయినా లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన , ఈ షోలో పాల్గొన్న ప్రతీ సామాన్యుడికి ఉంది. అందుకు ఉదాహరణగా నిల్చింది ఈరోజుటి ఎపిసోడ్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి ఒక డేర్ ని ఇస్తూ ‘ఎవరైతే బిగ్ బాస్ టాటూ ని వేయించుకుంటారో , వాళ్ళని టాప్ 15 లోకి నేరుగా పంపిస్తాము అని అంటారు’. ఈ డేర్ చేయడానికి కంటెస్టెంట్స్ అందరూ ముందుకొస్తారు . ఆ తర్వాత నవదీప్ ఒక ట్విస్ట్ ని ఇస్తూ ‘ఇది చేతి మీద వేసే టాటూ కాదు. నుదిటిపై వేసే టాటూ’ అని అంటాడు. అప్పుడైనా కంటెస్టెంట్స్ లో కొంతమంది అయినా వెనకడుగు వేస్తారని అనుకుంటే , ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళలేదు. అందరూ నుదిటిపై టాటూ వేయించుకోవడానికి కూడా సిద్ధం అవుతారు. వీళ్ళు అసలు వెనక్కి తగ్గేలా లేరు , నవదీప్ మరో ట్విస్ట్ ఇస్తాడు. ‘నుదిటి పై టాటూ వేయించుకోవాల్సిన అవసరం లేదు. చేతి మీద వేయించుకోవచ్చు, కానీ బిగ్ బాస్ అనే పదాలతో కాదు , ‘తూ నా బ్రతుకు’ అనే పదాలతో వేయించుకోవాలి’ అని అంటాడు నవదీప్.
కనీసం ఇప్పుడైనా కంటెస్టెంట్స్ వెనకడుగు వేసారా అంటే , లేదు. ఇక చివరికి ఒక గంటని ఏర్పాటు చేసి, ఎవరైతే ముందుగా గంటని పెట్టుకుంటారో , వాళ్ళు ఈ డేర్ ని చేయొచ్చు అని అంటారు. ఈ టాస్క్ లో నవరసాల మామ అలియాస్ రామకృష్ణ అందరికంటే ముందుగా గంట పట్టుకొని , ‘తూ నా బ్రతుకు’ అనే టాటూ ని వేయించుకుంటాడు. ఇది చూసి జడ్జీలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మరోపక్క ఇలాంటి టాస్కులు నిర్వహిస్తున్నందుకు జడ్జీలపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అవకాశం కోసం వస్తే , ఇలాంటి టాస్కులు పెడుతారా?, ఇది చాలా అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
View this post on Instagram