Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha: 'కనీసం ఇది కూడా తెలియదా' అంటూ 'అగ్ని పరీక్ష' లో జడ్జీల...

Bigg Boss Agnipariksha: ‘కనీసం ఇది కూడా తెలియదా’ అంటూ ‘అగ్ని పరీక్ష’ లో జడ్జీల పరువు తీసిన కంటెస్టెంట్.. వీడియో వైరల్..

Bigg Boss Agnipariksha: వచ్చే నెల 6 వ తేదీ నుండి అన్ని భాషల్లోనూ ‘బిగ్ బాస్’ సరికొత్త సీజన్స్ ప్రారంభం కాబోతుంది. అయితే మన తెలుగు లో ‘అగ్నిపరీక్ష’ షో సూపర్ హిట్ అవ్వడం తో అన్ని భాషల్లోనూ ఈ షో ని మొదలెట్టారు. ప్రస్తుతం ప్రతీ రోజు రాత్రి స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘అగ్ని పరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం […]

Bigg Boss Agnipariksha: వచ్చే నెల 6 వ తేదీ నుండి అన్ని భాషల్లోనూ ‘బిగ్ బాస్’ సరికొత్త సీజన్స్ ప్రారంభం కాబోతుంది. అయితే మన తెలుగు లో ‘అగ్నిపరీక్ష’ షో సూపర్ హిట్ అవ్వడం తో అన్ని భాషల్లోనూ ఈ షో ని మొదలెట్టారు. ప్రస్తుతం ప్రతీ రోజు రాత్రి స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘అగ్ని పరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన తెలుగు ‘అగ్ని పరీక్ష 2’ నే చాలా వివాదాస్పదంగా ఉందని అనుకుంటే, కన్నడ ‘అగ్నిపరీక్ష’ ఇంకా పెద్ద వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియా లో ఒక కంటెస్టెంట్ ని జడ్జీలు ‘మమ్మల్ని ఇంప్రెస్ చెయ్యి’ అని అడగడం , నేను చెయ్యని అని ఆ కంటెస్టెంట్ చెప్పడం తో , జడ్జీలు బయటకి పొమ్మనడం , ఆ కంటెస్టెంట్ మైక్ విసిరి బయటకి వెళ్లిపోయిన వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది.

ఈ వీడియో తో పాటు, ఇదే ఎపిసోడ్ కి సంబంధించిన మరో వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. ‘అగ్నిపరీక్ష’ స్టేజి మీదకు అడుగుపెట్టిన ఈ కంటెస్టెంట్ జడ్జీలు పరువు తీసాడు అనే చెప్పాలి. ముందుగా యాంకర్ నువ్వు చాలా ఫేక్ గా కనిపిస్తున్నావు అని అనడం తో , దానికి ఈ కంటెస్టెంట్ ‘థాంక్యూ’ అని సమాధానం ఇవ్వడం , ఆ తర్వాత ఒక జడ్జి ‘ఏమి చదువుకున్నావు’ అని అడగ్గా , అందుకు ఆ కంటెస్టెంట్ ‘బీటెక్’ అని సమాధానం చెప్పడం, అప్పుడు ఆ జడ్జి అతన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఒక సర్కిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి’ అని అడగ్గా, ఆ కంటెస్టెంట్ ‘సర్కిల్ కి సైడ్స్ ఎందుకు ఉంటాయి?’ అని సమాధానం చెప్పడంతో , జడ్జి ముఖం ఒక్కసారిగా మాడిపోయింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ ఈ వీడియో ని చూసి జడ్జీలను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎదో పెద్ద తెలిసిన వాడిలాగా ఆ ప్రశ్న అడగడం ఎందుకు?, పరువు తీసుకోవడం ఎందుకు?, అయినా సర్కిల్ కి సైడ్స్ ఉండడం ఏంటి?, చిన్న పిల్లలకు తెలిసింది కూడా వీళ్లకు తెలియదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Madhushree (@_rhythms_of_life)

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper