spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: పృథ్వీ ని దారుణంగా టార్గెట్ చేసిన అవినాష్, రోహిణి.. పనికిమాలిన...

Bigg Boss Telugu 8: పృథ్వీ ని దారుణంగా టార్గెట్ చేసిన అవినాష్, రోహిణి.. పనికిమాలిన కారణాలతో నామినేషన్స్!

Bigg Boss Telugu 8: వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన రోజు నుండి ఎందుకో అవినాష్ , రోహిణి పృథ్వీ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. వీళ్లిద్దరికీ పృథ్వీ అంటే అసలు నచ్చడం లేదు, వాళ్లకి ఇతర హౌస్ మేట్స్ మీద పాయింట్స్ దొరకకపోవడం తో పృథ్వీ నే టార్గెట్ చేసి నామినేషన్స్ వేస్తున్నారు. గత వారం పృథ్వీ, అవినాష్ కి మధ్య నామినేషన్స్ సమయం లో మాటామాటా పెరిగి పెద్ద గొడవ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పృథ్వీ క్షమాపణలు చెప్పాడు, కలిసిపోయారు, వీకెండ్ ఎపిసోడ్ లో కూడా వీళ్లిద్దరు కలిసి ఫన్ చేసారు. కానీ నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో అవినాష్ పృథ్వీ ని మళ్ళీ అవే పాయింట్స్ తో నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ముందుగా అవినాష్ మాట్లాడుతూ ‘మీరు గత వారం నాతో అగౌరవంగా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు. దానికి మీ నుండి నేను క్షమాపణలు ఆశించాను. కానీ మీరు చెప్పలేదు. ఇక రెండవది ఏమిటంటే కటింగ్ టాస్క్ వచ్చినప్పుడు, మీరు ఒప్పుకొని ఒక్క అడుగు ముందుకు వచ్చునంటే బాగుండేది అని అనిపించింది. మీరు నాగార్జున గారు అడిగినా కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసారు. బిగ్ బాస్ గేట్ దాటి లోపలకి వచ్చాము అంటే గేమ్ మొదలైనట్టే. కేవలం టాస్కులు ఆడడం ఒక్కటే కాదు. ఈ రెండు పాయింట్స్ నాకు అసలు నచ్చలేదు బ్రదర్’ అని అంటాడు. దానికి పృథ్వీ సమాధానం చెప్తూ ‘నామినేషన్స్ సమయంలో హీట్ ఆఫ్ ది మూమెంట్ నేను అన్న దానికి మీకు క్షమాపణలు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీకు క్షమాపణలు చెప్తున్నాను..ఇక రెండవ పాయింట్ విషయానికి వస్తే, హౌస్ కోసం నేను నా శక్తికి మించి టాస్కులు ఆడి ప్రైజ్ మనీ కి యాడ్ చేశాను. కానీ నాకు నచ్చని పనులు కొన్ని ఉంటాయి. అవి నేను ఎవరు వచ్చి చెప్పినా మార్చుకోలేను. నేను నాలాగే ఉన్నాను. మీరు ఇంత చెప్తున్నారు కదా, 50 వేల రూపాయిల కటింగ్ నే ఎందుకు ఎంచుకున్నారు, లక్ష రూపాయిలది ఎందుకు ఎంచుకోలేదు?’ అని అడుగుతాడు.

అప్పుడు అవినాష్ అది నా ఇష్టం అని అంటాడు. కదా, ఇది కూడా నా ఇష్టం, అందులో తప్పేమి ఉంది అని అంటాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన అవినాష్, మళ్ళీ పృథ్వీ ని తగ్గిస్తూ మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇది కచ్చితంగా అతని మీద పగ పెట్టుకొని మాట్లాడినట్టుగానే అనిపించింది. రోహిణి కూడా నిన్న ఇదే విధంగా స్పందించింది. పృథ్వీ బాడీ షేమింగ్ చేయడం కచ్చితంగా తప్పే, కానీ దానికి ముందు ఆమె పృథ్వీ ని చాలా అంటే చాలా ట్రిగ్గర్ చేసింది. ఇలా వీళ్లిద్దరు కేవలం అతన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్లిద్దరికీ హౌస్ లో అందరితో మంచి ర్యాపో ఉంది, పృథ్వీ తో లేదు, ఇక రాబోయే వారాల్లో కూడా వీళ్ళిద్దరూ కచ్చితంగా పృథ్వీ మీదనే నామినేషన్స్ వేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper