Government Employee Marriage: పెళ్లికి ఈడు జోడు కావాలి. సరైన వయసులోనే పెళ్లి చేసుకోవాలి.. ఈ మాట అన్నది ఎవరో కానీ.. ఈ కంటెంట్ కింద ఉన్న వీడియో చూసిన తర్వాత కచ్చితంగా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అసలు పెళ్లికి ఈడు జోడు అవసరం లేదని.. సరైన వయసులోనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని.. అది ఉంటే చాలని కచ్చితంగా చెబుతారు.
సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో ఒక వ్యక్తికి దాదాపు 50 సంవత్సరాలు వరకు ఉంటాయి. అతని పక్కనే పాతికేళ్ల పడుచులాంటి ఒక యువతీ ఉంది. చాలామంది వారిద్దరిని చూస్తే తండ్రి కూతుర్లు అనుకుంటారు. కానీ అసలు కాదు.. ఆమె అతడి భార్య. అతడేమో కింద గేజ్.. పైన ఏజ్ పెట్టుకుని ఉన్నాడు. ఆమెనేమో పాతికేళ్ల యువతీ లాగా కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి రీల్స్ చేస్తున్నారు. ఏంది కథ అని లోతుగా వెళ్లి చూస్తే.. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అంట. ఇంకేముంది చూసే వాళ్లకు ఫ్యుజులు ఎగిరిపోయాయి. 2026 లో ఇటువంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలి రా అనే ఆందోళన కలిగించాయి.
ఆ వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ ఉంది. భారీగానే సంపాదిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించే క్రమంలో అతడు తీవ్రంగా శ్రమించాడు. ఫలితంగా అతడు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది. గవర్నమెంట్ జాబ్ కావడం.. దండిగా జీతం వస్తున్న నేపథ్యంలో మంచి సంబంధమే దొరికింది. పైగా వయసు అంతరం చాలా ఉన్నప్పటికీ ఓ యువతి అతడిని పెళ్లి చేసుకుంది. అంతేకాదు అతనితో రీల్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. చివరికి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరి వీడియోలను చూసిన వారంతా.. మంచి మంచి పండ్లను కీటకాలు మాత్రమే తింటాయి.. ఆ యువతి పండు అయితే.. ఇతడేమో కీటకం.. చివరికి అదృష్టం కొద్దీ తినేస్తున్నాడు అంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నేటికాలంలో చాలామంది యువతులు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవారినే పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఆర్థికభరోసా ఉంటుంది.మెరుగైన భద్రత ఉంటుంది. అందువల్లే వారిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ యువతి కూడా అలాంటి ఆలోచనతోనే ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఉంటుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram