Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఇప్పుడు వింతగా ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శల్లో ఎక్కువగా తప్పులు దొరుకుతున్నాయి. అలాగని ఆ తప్పులను అంగీకరించే పరిస్థితుల్లో లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. నిన్ననే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు కర్నూలు వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల గురించి పెద్ద లెక్చర్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులతో అరెస్టుల పర్వం నడుస్తుండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కేసు గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చాలా ఎమోషన్ అయ్యారు.
* బైక్ ప్రమాదంతో..
శ్రీకాకుళం జిల్లాలో ఓ బైక్ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. అయితే ఆ ప్రమాదానికి కారణం మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు. అయితే ఆ కేసును తారుమారు చేసి మరొకరిపై మోపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీస్ అధికారులపై వీఆర్ వేటు పడింది. కేసులో మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టయ్యారు. ఆయనను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వచ్చారు. ఈ క్రమంలో 18 సంవత్సరాల పిల్లాడు బైక్ తో ప్రమాదం చేస్తే తప్పు కాదు అన్నట్టు మాట్లాడారు. అయితే తాజాగా కర్నూలు వెళ్లి ఇదే ప్రమాదం పై మాట్లాడారు. చిన్న బైక్ తో ప్రమాదం చేస్తే తప్పు కాదు అని వ్యాఖ్యానించారు. కారుతో ప్రమాదం చేసి ఉంటేనే తప్పు అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
* వైసీపీలో చర్చ..
జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సొంత పార్టీ వారికి కూడా నచ్చడం లేదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని పార్టీకి మరింత డామేజ్ చేస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తం అవుతుంది. బైక్ తో ప్రమాదం చేస్తే తప్పు కాదు అనేలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. కేవలం కారు తోనే ప్రమాదం చేస్తేనే తప్పు అన్నట్టు వ్యాఖ్యానించడం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చకు దారితీస్తోంది. తప్పు చేసిన నేతలను వెనుకేసుకు రావడం ఒక తప్పు. పదే పదే అదే తప్పును సమర్థిస్తూ మాట్లాడడం కూడా అంతకుమించిన తప్పు అవుతుంది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాధపడుతున్నాయి. అనవసరంగా పార్టీని ఇరకాటంలో పెడుతున్నారని జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
View this post on Instagram