Mahesh Babu: మన టాలీవుడ్ లో నేటి తరం సూపర్ స్టార్స్ లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే , అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ ప్రారంభం లో పెద్దగా కామెడీ టైమింగ్ చూపించలేదు కానీ, ఖలేజా నుండి మాత్రం తనలోని కామెడీ టైమింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. వాస్తవానికి మహేష్ బాబు లో ఇన్ బిల్డ్ కామెడీ టైమింగ్ ఉంటుంది. బయట ఆయన అందరితో చాలా సరదాగా ఉంటాడు. మాట్లాడుతూనే పంచులు మీద పంచులు వేస్తుంటాడు. ఇది వరకు ఆయన టైమింగ్ ని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చూశాము. అయితే మహేష్ టైమింగ్ గురించి రీసెంట్ గా ప్రముఖ నిర్మాత ఏం ఎస్ రాజు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన గతం లో మహేష్ బాబు తో ‘ఒక్కడు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ని మామూలు హీరో నుండి స్టార్ రేంజ్ కి ఎదిగేలా చేసిన చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ సమయం లో ఆయనతో జరిగిన కొన్ని సరదా సంభాషణల గురించి చెప్పుకొచ్చాడు ఏం ఎస్ రాజు. ఆయన మాట్లాడుతూ ‘ఒక పాట కోసం ముంబై నుండి ఒక డ్యాన్సర్ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆరోజు సెట్స్ లో బాగా ఎండగా ఉందని నల్లటి కూలింగ్ గ్లాస్ ని పెట్టుకొని ఉన్నాను. నా పక్కనే మహేష్ బాబు ఉన్నాడు. సడన్ గా నా అద్దాలు తీసుకున్నాడు. ఎందుకు తీసావు అని అడిగితే నువ్వు ఇక్కడ చూస్తున్నావా, లేదా అమ్మాయిని చూస్తున్నావా అని టెస్ట్ చేద్దామని తీసా అన్నాడు. అప్పుడు నేను వెంటనే కౌంటర్ వేస్తూ , నీ బద్దులు అందరికీ వస్తాయా ఏంటి అని అన్నాను. నేను అలాంటోడిని కాదండి , ఏకపత్నీవ్రతుడిని అని అన్నాడు’ అంటూ మహేష్ తో జరిగిన ఫన్నీ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఎంఎస్ రాజు.
ఆయన మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దాన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అప్పుడే 80 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుందట. మిగిలిన షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తి అవుతుందని సమాచారం. ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో అన్ని భాషల్లోనూ విడుదల కాబోతుంది.
View this post on Instagram