Funky Collection: విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన ‘ఫంకీ'(Funky Movie) చిత్రం, రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కామెడీ ని మాత్రమే ఎంజాయ్ చేసే వాళ్లకు ఈ సినిమా పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ సినిమాలో లాజిక్స్ ని వెతికేవాళ్లకు మాత్రం ఈ చిత్రం ఇదేమి సిల్లీ సినిమా రా బాబు అని అనిపిస్తుంది. అత్యధిక శాతం మందికి సిల్లీ అనిపించడం వల్లే, ఈ సినిమాకు ఇలాంటి ఫలితం ఎదురైంది. జాతి రత్నాలు వంటి భారీ హిట్ ని తెరకెక్కించిన అనుదీప్ నుండి రాబోతున్న సినిమా కావడంతో, ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి 5 రోజుల్లో ఈ చిత్రం ఎంత షేర్ వసూళ్లను రాబట్టింది, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరం లో ఉంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 5వ రోజున 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 60 లక్షల రూపాయిల గ్రాస్ వాచినట్టు తెలుస్తోంది. షేర్ వసూళ్లు దాదాపుగా 25 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి కోటి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్రా + సీడెడ్ నుండి కోటి 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ 5 రోజుల్లో 3 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 6 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 1 కోటి 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 5 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 10 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో కోటి లేదా, అంతకు మించి మరో 50 లక్షల షేర్ వసూళ్లు తప్ప , ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. ఓవరాల్ గా ఈ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ వైపు అడుగులు వేస్తోంది. ఈ చిత్రానికి హీరోయిన్ కాయదు లోహార్ 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. నిర్మాత నాగవంశీ బయ్యర్స్ కి రిటర్న్ జీఎస్టీ డబ్బులు ఇచ్చిన తర్వాత, ఆ మూడు కోట్లు కూడా మిగిలేలా లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.