Homeఅంతర్జాతీయంUzbekistan Women: మహిళలకు ప్లాస్టిక్ సర్జరీ.. వీళ్ళు చేస్తున్న దారుణం మామూలుది కాదు..

Uzbekistan Women: మహిళలకు ప్లాస్టిక్ సర్జరీ.. వీళ్ళు చేస్తున్న దారుణం మామూలుది కాదు..

Uzbekistan Women: వాళ్లది ఈ ఊరు కాదు. ఈ దేశం కాదు. కాకపోతే పేదరికమే వారికి అసలైన శాపం. నాలుగు రోజులు పని కల్పిస్తాం.. మెరుగైన వసతి కల్పిస్తాం.. మంచి బట్టలు కొనిస్తాం.. డబ్బులు కూడా దండిగా ఇస్తామంటే నమ్మారు. దేశం కానీ దేశం వచ్చారు. మనదేశంలోని లక్నోలో అడుగు పెట్టారు. లక్నోలో అడుగుపెట్టిన వారికి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పని చూపిస్తానని చెప్పినవారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అనేక రకాలుగా పరీక్షలు చేశారు. ఆ […]

Uzbekistan Women: వాళ్లది ఈ ఊరు కాదు. ఈ దేశం కాదు. కాకపోతే పేదరికమే వారికి అసలైన శాపం. నాలుగు రోజులు పని కల్పిస్తాం.. మెరుగైన వసతి కల్పిస్తాం.. మంచి బట్టలు కొనిస్తాం.. డబ్బులు కూడా దండిగా ఇస్తామంటే నమ్మారు. దేశం కానీ దేశం వచ్చారు. మనదేశంలోని లక్నోలో అడుగు పెట్టారు.

లక్నోలో అడుగుపెట్టిన వారికి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పని చూపిస్తానని చెప్పినవారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అనేక రకాలుగా పరీక్షలు చేశారు. ఆ తర్వాత వాళ్ళ ముఖాలకు.. ఇతర అవయవాలకు.. ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే.. శరీరంలో సామర్థ్యం పెంచడానికి అని చెప్పారు. అది నిజమని వాళ్ళు నమ్మారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించారు. మనుషుల రూపంలో ఉన్న మహనీయులు వీళ్లు అని ఆ మహిళలు అనుకున్నారు. కానీ ఆ మహానీయులు మృగాలు అని.. దుర్మార్గులు అని తర్వాత తేలింది. వారు చేసిన పని ఆ మహిళల్లో జీవిత కాలానికి సరిపడే అగాధాన్ని నెలకొల్పింది..

లక్నోలో మహిళలతో చేస్తున్న ఓ పాడు పనికి సంబంధించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఉజ్బెకిస్తాన్ దేశంలోని లోలా కయుమోవా మహిళలకు కొందరు ముఠాలు మాయమాటలు చెబుతున్నారు. వారిని మన దేశానికి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వారికి ప్లాస్టిక్ సర్జరీలు చేయిస్తున్నారు. అనంతరం హాయ్ ప్రొఫైల్ పాడు పనులు చేస్తున్నారు.. అయితే ఈ పాడు పనులు చేయిస్తున్న ముఠాలో కీలక నాయకురాలిగా ఒక మహిళ ఉంది. సాటి మహిళగా అటువంటి వ్యవహారాలను తప్పుపట్టాల్సిన ఆమె ఏకంగా ముఠా సభ్యురాలుగా వ్యవహరించడం విశేషం. అయితే ఆమె ఎక్కడా కూడా తెరమీద కనిపించదు. తెర వెనుక మాత్రమే ఈ వ్యవహారాలు సాగిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లక్నో ప్రాంతంలో పోలీసులు ఈ వ్యవహారం గుట్టు రట్టు చేశారు. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమెను అరెస్ట్ చేశారు.

2025లో ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదైనప్పటికీ.. ఆమె తనకున్న రాజకీయ అండతో పోలీసులను ముందడుగు వేయకుండా చేసింది. చివరికి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి.. రాజకీయంగా ఒత్తిడి ఎదురైనప్పటికీ ఆమెను అరెస్ట్ చేయడం విశేషం. ఇలాంటి పాడు పనుల ద్వారా ఆ మహిళ భారీగానే సంప్రదించినట్టు పోలీసుల ఎంక్వయిరీలో తేలింది. ఈమెకు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అండగా ఉన్నారని సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి చివరికి ఆ పాడు మహిళను కటకటాల వెనక్కి పంపించారు.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper